రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్ అవుతుందని ఇటీవల రామ్ చరణ్ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు ఆయన స్పందించారు. కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే నిజమయ్యాయి. పెద్ది సినిమా విడుదలను మళ్లీ వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. మార్చి 19, 2026న విడుదల కావల్సిన ఈ చిత్రాన్ని ఇటీవలే ఏప్రిల్ 30, 2026కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విడుదల తేదీని జూన్‌కు మార్చారు. జూన్‌లో కచ్చితంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తేదీ చెప్పలేదు. కానీ త్వరలోనే దీనిపైనా అప్‌డేట్ ఇస్తామని మేకర్స్ తెలిపారు. ఇక చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నందుకు గల కారణాలను కూడా మేకర్స్ తెలిపారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది మూవీ గురించి అందరూ ఇటీవల అనుకున్నదే జరిగింది. ఈ సినిమా విడుదలను మళ్లీ వాయిదా వేశారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూన్‌కు వాయిదా వేస్తున్నామని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ చూపించిన ప్రేమ, సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మేకర్స్ తమ ఎక్స్ పోస్టులో వెల్లడించారు. చిత్ర గ్లింప్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని, పెద్ది మూవీ పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు సంతోషంగా ఉన్నామని, ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ పూర్తయిందని, కేవలం ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపారు. తాజాగా ఎడిట్ కాపీని చూశామని, సినిమా అద్భుతంగా వచ్చిందని, కానీ ఫ్యాన్స్‌కు మరింత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించడం కోసం కృషి చేస్తున్నామని, మరింత పర్‌ఫెక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపారు. జూన్‌లో పెద్ది సినిమాను ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తామని, విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ప్రేక్షకుల సపోర్ట్, ఓపికకు మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పోస్టులో పేర్కొన్నారు.
పెద్ద సినిమాపై అభిమానుల్లో మొదట్నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించడమే కాకుండా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ పాత్రను పోషిస్తుండడం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం వంటి కారణాల వల్ల సినిమాకు ఇప్పటికే భారీగా హైప్ వచ్చింది. ఇక పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన పెద్ది గ్లింప్స్ ఎంతో ఆకట్టుకుంది. ఇందులో చరణ్ లుక్‌తో అభిమానులు ఫిదా అయ్యారు. అయితే పెద్ది సినిమా విడుదల వాయిదా పడడం, విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు మరోమారు నిరాశకు గురవుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…