మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్ దేవర కోసం నిర్మించిన అండర్ వాటర్ సముద్రపు సెట్స్‌లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సినిమాలోని పడవ ఫైట్ సీన్స్ కొన్ని సామాజిక మాధ్యమాల్లో లీకై వైరలయ్యాయి. దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా కీలక జాగ్రత్తలు వహిస్తోంది. అయితే జూనియర్ ఎన్‌టీఆర్ దేవర సినిమా కోసం ఆ మూవీ మేకర్స్ నిర్మించిన సముద్రపు సెట్స్‌లో ప్రస్తుతం వారణాసి సినిమా తెరకెక్కుతుందని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. కానీ దీనికి ప్రధాన కారణం ఉంది.
వారణాసి సినిమాకు సంబంధించి సముద్రం, అండర్ వాటర్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఇందుకు గాను పశ్చిమ ఆసియా దేశాలకు చిత్ర యూనిట్ వెళ్లాల్సి ఉంది. అయితే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లడం వీలు కాదు కనుక చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ ఎన్‌టీఆర్ గతంలో నటించిన దేవర సినిమా సెట్స్ అలాగే ఉండడంతో వాటిల్లో చిత్ర సన్నివేశాలను తీస్తున్నారు. అయితే దర్శకుడు రాజమౌళి సాధారణంగా ఇలాంటి విషయాల్లో రాజీ పడరు. కానీ సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయాలనే సంకల్పంతో ఆయన చిత్ర షూటింగ్‌కు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా అనుకున్న తేదీలకే షెడ్యూల్ పూర్తయ్యేలా చేస్తున్నారు. అందుకనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఇక వారణాసి చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఏడాది ఉగాది పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే శరవేగంగా చిత్ర షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం మహేష్ బాబుతో నీటి అడుగున కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అందుకనే వారు దేవర సెట్స్‌ను ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నారు. ఇక వారణాసి మూవీ టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా థీమ్ గురించి గతంలోనే దర్శకుడు రాజమౌళి చెబుతూ 3 నిమిషాల వీడియోను రిలీజ్ చేయగా దానికి సామాజిక మాధ్యమాల్లో భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఇక త్వరలోనే ఓ పాటను రిలీజ్ చేయనున్నారని సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…