రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ సుమారు రూ.155 కోట్లకు కొనుగోలు చేసింది. హిందీ చిత్రాల ఓటీటీ చరిత్రలో అత్యంత భారీ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు చెందిన మొదటి భాగ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయగా, ఇప్పుడు నిర్మాతలు భారీగా మార్పులు చేసి జియో హాట్ స్టార్‌తో డీల్‌ను కుదర్చుకున్నారు. అయితే ఓటీటీ డీల్ కుదిరిన నేపథ్యంలో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎప్పుడు వస్తుంది.. అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఇప్పుడప్పుడే ఓటీటీలోకి రావడం లేదని, ఇంకా టైం పడుతుందని తెలుస్తోంది.
ధురంధర్ 2 సినిమాను ఓటీటీలో చాలా ఆలస్యంగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఇప్పటికీ ఇంకా థియేటర్లలో వసూళ్లను కొనసాగిస్తుండడంతో దీన్ని మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ చేస్తారని తెలుస్తోంది. అప్పటి వరకు ఐపీఎల్ కూడా ముగుస్తుంది కనుక ఓటీటీలో అప్పుడు విడుదల చేస్తే వ్యూయర్‌షిప్ కూడా ఎక్కువ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకనే ఓటీటీ రిలీజ్‌ను ఆలస్యం చేయనున్నారని సమాచారం. ఇక ధురంధర్ 2 సినిమా మార్చి 19, 2026న రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి భారీగా వసూళ్లను సాధించింది. విడుదలై ఇప్పటికే అనేక వారాలు గడిచినా సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్లలోకి ప్రేక్షకులను ఈ సినిమా ఇంకా ఆకర్షిస్తోంది. ఈ సినిమా 5వ ఆదివారం రోజు రూ.5.20 కోట్ల వసూళ్లను సాధించి దేశీయంగా మొత్తం రూ.1,115.67 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,756.64 కోట్ల గ్రాస్‌తో ఈ మూవీ భారత సినిమా చరిత్రలోనే మూడో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.
రణవీర్ సింగ్ నటించిన ఈ భారీ యాక్షన్ చిత్రం థియేటర్లలో ఇప్పటికీ బ్లాక్ బస్టర్ రన్‌ను కొనసాగిస్తోంది. అయితే సినిమా ఓటీటీలోకి విడుదలవడం ఆలస్యం కానుండడంతో ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ మూవీని మళ్లీ చూడాలంటే కనీసం ఇంకో నెల రోజులు లేదా 40 రోజుల వరకు వేచి చూడక తప్పదు. ఇక ఈ సినిమాలో రణవీర్ సింగ్ జస్కీరత్ సింగ్ రంగీ పాత్రలో తిరిగి కనిపించాడు. అతను ఇప్పుడు హమ్‌జా అలీ మజారీగా పూర్తిగా మారిపోయి మరింత ప్రమాదకరమైన వ్యక్తిగా అవతరించాడు. మొదటి భాగంలో రెహ్మాన్ డెకాయిట్‌ను ఓడించిన తర్వాత, అతని ప్రయాణం కరాచీ అండర్‌వరల్డ్‌లో కొనసాగుతుంది. అక్కడ అతను షేర్-ఏ-బలోచ్ గా భయంకర వ్యక్తిగా ఎదుగుతాడు. సీక్వెల్‌లో అతని గతాన్ని మరింత లోతుగా చూపిస్తూ, ఆర్ మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ అతన్ని ఒక హై-రిస్క్ మిషన్ కోసం ఎలా ఎంపిక చేశాడో వెల్లడిస్తారు. రణవీర్ సింగ్, ఆర్ మాధవన్‌తో పాటు రాకేష్ బేడీ, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ విడుదలతో మరింతగా ప్రేక్షకాదరణ పొందే అవకాశముందని భావిస్తున్నారు.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…