వినోదం

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ వేడుకల్లో ‘వారణాసి’ చిత్ర విశేషాలను పంచుకోనున్న ఎస్ఎస్ కార్తికేయ. Photo Credit: SS Karthikeya/X.

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్ త‌ర‌చూ ఓ అప్ డేట్ ను అందిస్తూ ప్రేక్ష‌కుల్లో బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ మ‌రో కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. వార‌ణాసి చిత్రానికి సంబంధించిన ప‌లు స‌న్నివేశాల‌తోపాటు బిహైంద్ ది సీన్స్ (బీటీఎస్) వీడియోల‌ను మెక్సికోలో జ‌ర‌గ‌నున్న కామిక్ కాన్ ఎక్స్‌పీరియెన్స్‌లో ఎక్స్‌క్లూజివ్ గా ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి కార్తికేయ హాజ‌రు కానుండ‌గా, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాత్రం ప్ర‌త్యేక వీడియో మెసేజ్‌ను అక్క‌డి అభిమానులను ఉద్దేశించి ఇవ్వ‌నున్నారు.

మెక్సికోలో కంటెంట్ ప్ర‌ద‌ర్శ‌న‌..

రాజ‌మౌళి, మ‌హేష్ బాబుల కాంబినేష‌న్ లో వ‌స్తున్న వార‌ణాసి సినిమా కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, కార్తికేయ అందించిన ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌, ప్రేక్షకుల్లో సంతోషాన్ని నింపింది. కాగా మెక్సికోలో కామిక్ కాన్ ఎక్స్‌పీరియెన్స్ కార్య‌క్ర‌మాన్ని ఏప్రిల్ 24 నుంచి 26 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా నిర్మాత కార్తికేయ పాల్గొంటారు. ప్ర‌ద‌ర్శ‌న‌లో వార‌ణాసి మూవీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలు, బీటీఎస్ దృశ్యాల‌తోపాటు కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌తో కూడిన గ్లింప్స్‌ను కూడా ప్రేక్ష‌కుల‌కు చూపించ‌నున్నారు. అయితే ఆ సీన్లు, వీడియోలు అన్నీ భార‌త ప్రేక్ష‌కులకు కూడా అందుబాటులో ఉంటాయా, లేక అక్క‌డి ప్రేక్ష‌కుల‌కే వాటిని ప‌రిమితం చేస్తారా.. అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో..

ఇక వార‌ణాసి చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్‌ను కొన‌సాగిస్తున్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌తీయ సినిమా స‌త్తాను చాటేలా ఈ సినిమాను రాజ‌మౌళి అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రాల‌తోపాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క‌పాత్ర‌లో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో ఆయ‌న ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లింప్స్‌, టీజ‌ర్లు, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌తో మూవీపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద చిత్రం ఎలాంటి సంచ‌ల‌న విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM