వినోదం

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి చిందులేయనున్న శ్రుతి హాసన్. Photo Credit: Shruti Haasan/Instagram.

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా, ప్ర‌స్తుతం దానికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. ఐట‌మ్ సాంగ్ మిన‌హా పెద్ది సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగా, ఆ పాట కోసం హీరోయిన్‌ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డ చిత్ర యూనిట్ ఎట్ట‌కేల‌కు ఓ న‌టిని సెలెక్ట్ చేసింది. ఆ పాట కోసం మృణాల్ ఠాకూర్ స‌హా ప‌లువురు హీరోయిన్ల‌ను చిత్ర యూనిట్ సంప్ర‌దించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఐట‌మ్ సాంగ్‌కు ఎట్ట‌కేల‌కు త‌మిళ న‌టి శ్రుతి హాస‌న్ పేరును ఖ‌రారు చేశారు. ఆమె ఆ పాట‌లో ఆడిపాడ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక ఆ పాట‌ను ఏప్రిల్ 26, 2026 నుంచి చిత్రీక‌రించ‌నుండ‌గా, హైద‌రాబాద్ శివార్ల‌లో తీర్చిదిద్దిన ప్ర‌త్యేక సెట్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. ఇక పెద్ది సినిమా ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డ‌గా మేక‌ర్స్ ఈ మూవీని జూన్‌కు వాయిదా వేశారు. విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

శ్రుతికి ఇది రెండో ఐట‌మ్ సాంగ్‌..

పెద్ది సినిమాలో ఐట‌మ్ సాంగ్ కోసం శ్రుతి హాస‌న్‌ను ఎంపిక చేయ‌డం అంద‌రినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే శ్రుతికి ఐట‌మ్ సాంగ్‌ల‌లో న‌టించ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలో మ‌హేష్ బాబు ఆగ‌డు సినిమాలో జంక్ష‌న్‌లో.. అంటూ ప్ర‌త్యేక గీతంలో ఆడి పాడింది. ఇక తెలుగులో ఆమె చేస్తున్న రెండో ఐట‌మ్ సాంగ్ పెద్దిలోదే కావ‌డం విశేషం. దీంతో ఆ పాట బంప‌ర్ హిట్ అవ‌డం ఖాయ‌మ‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే శ్రుతి హాస‌న్ ఇది వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎవ‌డు సినిమాలో న‌టించింది. ఆ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ఇక పెద్ది సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీకపూర్ న‌టిస్తుండ‌గా, ఆమెకు తెలుగులో ఇది దేవ‌ర త‌రువాత రెండో సినిమా, చ‌ర‌ణ్‌తో మొద‌టి సినిమా కావ‌డం విశేషం.

ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు..

పెద్ది సినిమా వాస్త‌వానికి ఏప్రిల్ 30న రిలీజ్ కావ‌ల్సి ఉంది. అయితే సినిమా షూటింగ్ పూర్త‌వ‌క‌పోవ‌డం, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వంటి కార‌ణాల‌తో విడుద‌ల‌ను జూన్‌కు మార్చారు. కానీ తేదీని ప్ర‌క‌టించ‌లేదు. ఇక ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న‌ట్లు చిత్ర గ్లింప్స్‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తుండ‌గా, చిత్రంలోని పాటలు ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో పెద్ది సినిమాపై చ‌ర‌ణ్ అభిమానుల‌తోపాటు ప్రేక్ష‌కుల్లోనూ భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM