టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మొత్తం రూ.131 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన బీసీసీఐ, ఈసారి తన సొంత రికార్డును తానే అధిగమించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు మొత్తం టోర్నమెంట్‌లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడింది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత జట్టు మూడోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పీటీఐ నివేదిక ప్రకారం ఈ రూ.131 కోట్ల బహుమతి మొత్తం 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి వర్తిస్తుంది.
ఈ బహుమతి మొత్తాన్ని ఎలా విభజిస్తారన్న విషయంపై బీసీసీఐ స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. అయితే పీటీఐకు అందిన సమాచారం ప్రకారం, రూ.131 కోట్ల బహుమతిలో ఎక్కువ భాగం ఆటగాళ్లకే కేటాయించబడుతుంది. సహాయక సిబ్బందికి ఇచ్చే మొత్తాన్ని వారి హైరార్కీ ప్రకారం నిర్ణయిస్తారు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో విజేతలుగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తోంది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లకు బోర్డు మరోసారి అభినందనలు తెలియజేస్తోంది. భవిష్యత్తులో కూడా వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటోంది.. అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. అదేవిధంగా ఆతిథ్య దేశంగా ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలిచిన తొలి జట్టుగా కూడా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లకు బోర్డు మరోసారి అభినందనలు తెలియజేస్తోంది. భవిష్యత్తులో కూడా వారు విజయాలు కొనసాగించాలని కోరుకుంటున్నాం.. అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు టైటిల్ గెలిచిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి కూడా గణనీయమైన ఆర్థిక బహుమతిని అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌కు ఐసీసీ విజేతల బహుమతిగా 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.21.5 కోట్లు) అందించింది. టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.17 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.10.75 కోట్లు) బహుమతిగా లభించాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…