కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె తాను కారులో ప్రయాణిస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఉర్వశి రౌటేలా ఇటీవల కొన్ని రోజులుగా వృత్తిపరమైన కార్యక్రమాల కోసం కువైట్‌లో ఉంది. అయితే అక్కడ యుద్ధం జరుగుతుండడంతో తాను తీవ్ర భయాందోళనలకు గురయ్యానని అంతకు ముందు ఆమె సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమె ఎట్టకేలకు విమానంలో ఇండియాకు సేఫ్ గా చేరుకుంది. దీంతో ఆమె భావోద్వేగానికి గురైంది. తన ప్రయాణంలో తాను పడ్డ వేదనను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వివరించింది.
విమానంలో కూర్చున్నప్పుడు తాను బాగానే ఉన్నానని ఊర్వశి రౌటేలా తెలిపింది. అయితే సీట్‌లో కూర్చున్న వెంటనే ఒక్కసారిగా భయం ఆవరించిందని, గుండె వేగంగా కొట్టుకుందని, తనకు ఆ సమయంలో అలా ఎందుకు అనిపించిందో అర్థం కాలేదని తెలిపింది. ఆ సమయంలో తాను తీవ్రంగా భయపడ్డానని వెల్లడించింది. తాను అప్పుడు బలహీన క్షణాల్లో ఉన్నట్లు తనకు అనిపించిందని, అందుకనే తన కోసం ప్రార్థించాలని తాను ఆ సమయంలో అభిమానులను వేడుకున్నానని తెలిపింది. అయితే తాను భావోద్వేగంతో మాట్లాడి ఉంటే అభిమానులు తనను క్షమించాలని కూడా ఆమె కోరింది. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితి నేపథ్యంలో అలా చేశానని చెప్పుకొచ్చింది. ఇక కువైట్‌లో విమానాశ్రయ సిబ్బంది, స్థానిక అధికారులు తనకు సురక్షిత ప్రయాణం కల్పించినందుకు ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపింది.
కాగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో అక్కడ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న అనేక మంది భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. సెలబ్రిటీలు కూడా కొందరు అక్కడే చిక్కుకుపోయి విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇండియాకు వస్తున్నారు. అందులో భాగంగానే ఊర్వశి రౌటేలా కూడా విమాన సర్వీసు ద్వారా భారత్‌కు చేరుకుంది. ఇక ఇప్పటికే నటి సోనాల్ చౌహాన్ దుబాయ్ నుంచి సురక్షితంగా ఇంటికి చేరుకోగా నటులు ఈషా గుప్తా, ప్రీతి జింటా కూడా ఇండియాకు వచ్చినట్లు తెలిపారు. కాగా నటి లారా దత్తా ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నానని, విమానాల కోసం చూస్తున్నానని వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…