వినోదం

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతీయ ఆహార వైవిధ్యం, ముంబై రుచులపై ముచ్చటించిన ప్రియాంక చోప్రా. Photo Credit: Priyanka Chopra/Instagram.

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు. ప్రతి రాష్ట్రం తనకంటూ ప్రత్యేక రుచులు, వంటకాలతో ప్రసిద్ధి చెందింద‌ని, ఒకే ఒక్క వంటకం ద్వారా భారతీయ ఆహార అనుభవాన్ని నిర్వచించడం దాదాపు అసాధ్యమ‌ని అన్నారు. తాజాగా కాండే నాస్ట్ ట్రావెలర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తొలిసారి భారత్‌కు వచ్చే వారు తప్పక రుచి చూడాల్సిన ఒక భారతీయ వంటకం ఏది అని ఆమెను అడ‌గ్గా, దేశం నుంచి ఒక వంటకాన్ని ఎంపిక చేయడం కష్టం అని ఆమె పేర్కొన్నారు. అందుకే ఆమె త‌న దృష్టిని కేవ‌లం ముంబై నగరంపై మాత్ర‌మే కేంద్రీకరించాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ముంబైకి చెందిన ప‌లు వంట‌కాల గురించి ఆమె వివ‌రించారు.

ఆ వంట‌కం అంటే ఇష్టం..

ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియాంకా.. ఒకే వంటకాన్ని ఎంపిక చేయడం కష్టం అని వివరించారు. భారతదేశం చాలా వైవిధ్యభరితమైన దేశం. రాష్ట్రాలు, నగరాలు మారే కొద్దీ ఆహారం, మసాలాల రుచులు కూడా మారుతాయి.. అని ఆమె అన్నారు. అయితే ముంబై గురించి ప్రత్యేకంగా అడిగినప్పుడు మాత్రం ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. భేల్ అని ఆమె సమాధానమిచ్చారు. ఇది పొంగించిన బియ్యంతో తయారయ్యే ఒక ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ అని, దీనిలో పుల్లగా, కరకరలాడే పదార్థాలు కలిపి తయారు చేస్తారని వివరించారు. అదనంగా దీన్ని కాగితపు కోన్ ఆకారంలో, పాత వార్తాపత్రికలో వడ్డిస్తారు.. అనే ప్రత్యేకత కూడా ఉందని ఆమె పేర్కొన్నారు.

భార‌తీయ వంట‌కాల‌నే ఇష్ట‌ప‌డ‌తా..

కాగా 2025 జూలైలో కూడా ప్రియాంకా తన రోజువారీ ఆహార అభిరుచుల గురించి మాట్లాడారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తనకు భారతీయ ఇంటి వంటకాలపైనే ఎక్కువ మక్కువ ఉందని ఆమె చెప్పారు. స్టఫ్డ్‌ పరాఠాలు, దాల్, ఆలూ గోభీ, తాజా ఫుల్కాలు వంటి ఇంటి వంటకాలను తినడం తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అంతేకాకుండా చేప కూర, పెరుగు అన్నం వంటి వంటకాలను కూడా ఇష్టపడతానని చెప్పారు. ఇది ఆమె మలయాళీ మూలాలను గుర్తుచేసే అంశమని ఆమె పేర్కొన్నారు. అలాగే సౌకర్యంగా అనిపించే సమయంలో ఇడ్లీలు, దోసెలు, పోహా వంటి సాధారణ వంటకాలను కూడా తినడం తనకు ఇష్టమని తెలిపారు. తనకు అత్యంత ఇష్టమైన ఫుడ్ విషయంలో కూడా ప్రియాంకా అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఒక సరదా ఫుడ్ ఛాయిస్ చాలెంజ్‌లో పాల్గొన్నప్పుడు, ముంబైకి ఎంతో ప్రీతిపాత్రమైన వడా పావ్ కంటే క్లాసిక్ హాట్ డాగ్‌ను ఎంపిక చేసి అనేక మందిని ఆశ్చర్యపరిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి సరదా స్పందనలు వచ్చాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM