ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ ఆదివారం, మార్చి 8, 2026న ప్రకటించింది. భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు ముందు ఈ ప్రకటన వెలువడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జట్టు టైటిల్‌ను నిలబెట్టుకునే కొన్ని గంటల ముందు స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ తేదీని ప్రకటించింది. అయితే టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఇంకా ప్రకటించలేదు. వివిధ రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల తేదీలపై స్పష్టత కోసం బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి ఎదురుచూస్తున్నాయి. గత సీజన్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ హోం గ్రౌండ్ అయిన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియానికి తిరిగి రానుంది. గత సీజన్ ఫైనల్లో ఆర్‌సీబీ పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) కార్యదర్శి సంతోష్ మెనన్ మాట్లాడుతూ లీగ్ దశలో ఆర్‌సీబీ తమ 7 హోం మ్యాచ్‌లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలోనే ఆడుతుందని స్పష్టం చేశారు. మిగతా 2 మ్యాచ్‌లు ఛత్తీస్‌గఢ్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. అయితే గతంలో చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ హోం మ్యాచ్‌లు జరగడంపై అనిశ్చితి నెలకొంది. 2025 జూన్ 4న ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన స్టేడియంలో పెద్ద ఎత్తున జనసమ్మేళనాలు నిర్వహించే సదుపాయాలపై సందేహాలను కలిగించింది. దాంతో కొంతకాలం పాటు స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడంపై తాత్కాలిక నిషేధం విధించబడింది. అలాగే ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లు కూడా ఇతర వేదికలకు మార్చబడ్డాయి.
అయితే జనవరి 17, 2026న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. భద్రతా ప్రమాణాలకు సంబంధించిన అన్ని నిబంధనలను కేఎస్‌సీఏ, ఆర్‌సీబీ పాటించాలనే షరతుతో ఈ అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరులో మ్యాచ్‌ల నిర్వహణకు సహకరించిన కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, కర్ణాటక పోలీసులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.. అని ఫ్రాంచైజీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ సీజన్‌కు ముందు మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలను మెరుగుపర్చేందుకు చేసిన సంయుక్త కృషి వల్ల డిఫెండింగ్ చాంపియన్లు తమ హోం గ్రౌండ్‌లోనే ఎక్కువ భాగం హోం మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది.. అని ఆ ప్రకటనలో మరోసారి స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కూడా గత ఏడాది మాదిరిగానే అదే ఫార్మాట్‌లో జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు లీగ్ దశలో తలా 14 మ్యాచ్‌లు ఆడతాయి. అనంతరం టాప్ 4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ఈసారి టోర్నమెంట్ ఫైనల్‌ను మే 31, 2026న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే మరో వారం రోజుల్లో టోర్నీ షెడ్యూల్‌పై స్పష్టత రానుందని సమాచారం. కానీ ముందుగా కొన్ని రోజుల వరకే షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తారని, ఆ తరువాత మిగిలిన రోజులకు షెడ్యూల్ విడుదల అవుతుందని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…