ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో విలాసవంతమైన కానుకతో తన తల్లి నిర్మల అల్లును సర్‌ప్రైజ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు కొత్త లెక్సస్ లగ్జరీ కారును బహుమతిగా అందజేశారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే నటుల్లో ఒకరైన అల్లు అర్జున్ తన సినిమాలతో పాటు కుటుంబానికి ఇచ్చే విలాసవంతమైన కానుకలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలి ప్రాజెక్టుల ద్వారా భారీ పారితోషికం పొందుతున్న ఆయన మల్టీప్లెక్స్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కుటుంబానికి కూడా ఆయన అధిక ప్రాధాన్యతను ఇస్తూ వారికి ఖరీదైన వాహనాలను బహుమతిగా అందిస్తున్నారు.
ఇక తన తల్లి నిర్మలకు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ తన తల్లితో కలిసి కార్ ముందు నిలబడి ఫోటోలు దిగారు. బహుమతిని స్వీకరిస్తున్న సమయంలో నిర్మల అల్లూ భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. అయితే అల్లు అర్జున్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి మాత్రం కచ్చితంగా సమయం కేటాయిస్తుంటారు. తన సినిమాల షూటింగ్‌లో కాస్త ఖాళీ దొరికినా కుటుంబ సభ్యులతో కలసి ఆయన విహార యాత్రలకు వెళ్తుంటారు. అలాగే సినిమా విడుదలయ్యాక కూడా ఒత్తిడి నుంచి బయట పడేందుకు టూర్లు వేస్తుంటారు. ఆయన చివరి సారిగా పుష్ప 2 లో యాక్ట్ చేయగా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది.
ఇక సినిమా రంగంలో అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ విజువల్ స్పెక్టకిల్ చిత్రంలో నటిస్తున్నారు. అదనంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టును కూడా ఆయన ప్రకటించారు. పుష్ఫ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన ఆయన తన తదుపరి చిత్రాలతో కూడా సత్తా చాటుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…