Samantha : ఇటీవలి కాలంలో సమంత పేరు వార్తలలో ఎక్కువగా వినబడుతోంది. అందుకు కారణం.. పుష్ప మూవీలో ఆమె ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేయడమే అని చెప్పవచ్చు. ఈ సాంగ్‌పై అనేక వివాదాలు నెలకొన్నాయి. దీంతో సహజంగానే సమంత పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఈ సాంగ్ చేసినందుకు చాలా మంది ఆమెను విమర్శిస్తున్నారు. హీరోయిన్‌గా మంచి అవకాశాలే వస్తుండగా.. ఇలాంటి పాటలలో చేయడం అవసరమా ? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఇటీవలి కాలంలో సమంత ప్రవర్తిస్తున్న తీరే ఎవరికీ అర్థం కావడం లేదు.
నాగచైతన్యతో విడాకులను తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత తాము ఎప్పటిలా స్నేహితుల్లా ఉంటామని చెప్పారు. అయితే వాస్తవానికి అలా జరగలేదు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా విడుదలైనప్పుడు, ఆ తరువాత మూవీ సక్సెస్ మీట్‌లో, అనంతరం చైతూ బర్త్ డేకు సమంత ఎలాంటి విషెస్ చెప్పలేదు. పోస్టులు పెట్టలేదు. దీంతో ఆమె చైతూ వల్ల బాగానే మనస్థాపానికి గురైనట్లు స్పష్టమైంది.
తాను సొంతంగా పెంచుకునే కుక్కకు బర్త్ డే చేసి దాని ఫొటోలను పోస్ట్ చేసింది సమంత. ఇక ఇటీవల రానా బర్త్ డేకు ఆమె శుభాకాంక్షలు చెప్పింది. అలాగే తాజాగా రానా భార్య మిహిక బర్త్ డేకు కూడా సమంత విషెస్ చెప్పింది. కానీ అక్కినేని ఫ్యామిలీ గురించి, చివరకు చైతూ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. వారి సినిమాలకు, ఈవెంట్లకు విషెస్ చెప్పడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె ప్రవర్తన ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.
ఈ మధ్య ఓ కార్యక్రమంలో డైవోర్స్‌పై సమంత స్పందించింది. తనకు ఈ ఏడాది అత్యంత చేదు సంవత్సరం అని చెప్పింది. ఇకపై ఎప్పుడు ప్రశ్నలు అడిగినా.. అందులో విడాకుల ప్రస్తావన తేవొద్దని జర్నలిస్టులను కోరింది. దీంతో ఆమె ఈ విషయంపై బాగానే డిస్టర్బ్ అయినట్లు స్పష్టమవుతోంది. అయితే భవిష్యత్తులోనైనా ఆమె అక్కినేని ఫ్యామిలీతో మాట్లాడుతుందా.. వారి గురించి పోస్టులు పెడుతుందా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…