Samantha : సమంత ఏమిటి ఇలా చేస్తోంది..? ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదే..!

December 19, 2021 7:39 PM

Samantha : ఇటీవలి కాలంలో సమంత పేరు వార్తలలో ఎక్కువగా వినబడుతోంది. అందుకు కారణం.. పుష్ప మూవీలో ఆమె ప్రత్యేక పాటలో డ్యాన్స్‌ చేయడమే అని చెప్పవచ్చు. ఈ సాంగ్‌పై అనేక వివాదాలు నెలకొన్నాయి. దీంతో సహజంగానే సమంత పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఈ సాంగ్‌ చేసినందుకు చాలా మంది ఆమెను విమర్శిస్తున్నారు. హీరోయిన్‌గా మంచి అవకాశాలే వస్తుండగా.. ఇలాంటి పాటలలో చేయడం అవసరమా ? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఇటీవలి కాలంలో సమంత ప్రవర్తిస్తున్న తీరే ఎవరికీ అర్థం కావడం లేదు.

how Samantha doing like this not understanding everyone

నాగచైతన్యతో విడాకులను తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత తాము ఎప్పటిలా స్నేహితుల్లా ఉంటామని చెప్పారు. అయితే వాస్తవానికి అలా జరగలేదు. నాగచైతన్య లవ్‌ స్టోరీ సినిమా విడుదలైనప్పుడు, ఆ తరువాత మూవీ సక్సెస్‌ మీట్‌లో, అనంతరం చైతూ బర్త్‌ డేకు సమంత ఎలాంటి విషెస్‌ చెప్పలేదు. పోస్టులు పెట్టలేదు. దీంతో ఆమె చైతూ వల్ల బాగానే మనస్థాపానికి గురైనట్లు స్పష్టమైంది.

తాను సొంతంగా పెంచుకునే కుక్కకు బర్త్‌ డే చేసి దాని ఫొటోలను పోస్ట్‌ చేసింది సమంత. ఇక ఇటీవల రానా బర్త్‌ డేకు ఆమె శుభాకాంక్షలు చెప్పింది. అలాగే తాజాగా రానా భార్య మిహిక బర్త్‌ డేకు కూడా సమంత విషెస్‌ చెప్పింది. కానీ అక్కినేని ఫ్యామిలీ గురించి, చివరకు చైతూ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. వారి సినిమాలకు, ఈవెంట్లకు విషెస్‌ చెప్పడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె ప్రవర్తన ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.

ఈ మధ్య ఓ కార్యక్రమంలో డైవోర్స్‌పై సమంత స్పందించింది. తనకు ఈ ఏడాది అత్యంత చేదు సంవత్సరం అని చెప్పింది. ఇకపై ఎప్పుడు ప్రశ్నలు అడిగినా.. అందులో విడాకుల ప్రస్తావన తేవొద్దని జర్నలిస్టులను కోరింది. దీంతో ఆమె ఈ విషయంపై బాగానే డిస్టర్బ్‌ అయినట్లు స్పష్టమవుతోంది. అయితే భవిష్యత్తులోనైనా ఆమె అక్కినేని ఫ్యామిలీతో మాట్లాడుతుందా.. వారి గురించి పోస్టులు పెడుతుందా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now