Vijayashanthi : సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్‌.. KCR అంటే కొత్త అర్థం చెప్పిన రాములమ్మ..!

December 19, 2021 8:09 PM

Vijayashanthi : తెలంగాణలో బీజేపీ, తెరాస పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యాసంగి వరిధాన్యం కొనాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుండగా.. కేంద్రం మాత్రం బాయిల్డ్‌ రైస్‌ను కొనేది లేదని, సాధారణ రైస్‌ను కొంటామని తేల్చి చెప్పింది. దీంతో తెరాస నాయకులు 20వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Vijayashanthi angry on cm kcr comments she told new definition to KCR

బీజేపీ నాయకులు రాష్ట్రంలో తిరగకుండా సీఎం కేసీఆర్‌ బెదిరిస్తున్నారని రాములమ్మ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.

“తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని “(K)కోతి (C)చేష్టల (R)రావు” గారి రాజ్యం తీరుగా చేసి గత్తర బిత్తర పరిపాలన నడిపిస్తున్నది మనందరం చూస్తూనే ఉన్నాము.”

“ఇక శ్రీరంగం కోవెల గజరాజు మొట్టికాయలు కొట్టినంకన్నా జర్రంత సక్కగైతదేమో అనుకుంటే… అట్లగాక రాష్ట్రానికి వచ్చిన వెంటనే బీజేపీని అడ్డుకోండ్రి…. ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను తిరగనియ్యకండ్రి అంటూ సీఎం స్థాయి కూడా మరచి “(K)కొండెంగె (C)చిందుల (R)రావు” గారి రాజ్యం లెక్క మరింత తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నరు.”

“ఇగ ప్రజల భయానికి జిల్లా పర్యటనలను మరోసారి కుంటి సాకులు చూపి, తప్పించుకుని ఎప్పటి లెక్కనే మోసపు మాటలు చెబ్తున్నరు. ఈ వింత, విపరీత, విచిత్ర విన్యాసాలన్నీ గమనిస్తున్న ప్రజలు సరైన సమయం కోసం హుజురాబాద్ తీరులో ఎదురు చూస్తున్నరు..” అంటూ విజయశాంతి కామెంట్‌ చేశారు. ఈ మేరకు ఆమె పోస్టు పెట్టారు.

https://www.facebook.com/VijayashanthiOfficial/posts/465156984975042

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now