Governor : ప‌శ్చిమ బెంగాల్ సీఎంకు చుక్క‌లు చూపించిన గ‌వ‌ర్న‌ర్‌.. తెలంగాణ‌కు..? త‌మిళిసై బ‌దిలీ..?

April 19, 2022 4:59 PM

Governor : ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌కు.. తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ప‌రిస్థితులు మారిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను ఎక్క‌డికి వెళ్లినా అవ‌మానిస్తున్నార‌ని ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప‌లుమార్లు వాపోయారు. ఆ మేర‌కు ఆమె మీడియాతో మాట్లాడారు. అలాగే ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోదీ.. కేంద్ర మంత్రి అమిత్ షాల‌ను ఆమె క‌లిశారు. తెలంగాణ‌లో ఉన్న ప‌రిస్థితుల‌ను ఆమె వివ‌రించారు. తాను రాష్ట్రంలో ఎక్క‌డికి వెళ్లినా అధికారులు త‌న‌ను రిసీవ్ చేసుకోవ‌డం లేద‌ని.. త‌న అధికారిక ప‌ర్య‌ట‌న‌ల‌కు వారు రావ‌డం లేద‌ని.. అలాగే ప్రోటోకాల్ పాటించ‌కుండా అవ‌మానిస్తున్నారని త‌మిళిసై ప్ర‌ధాని మోదీ.. అమిత్ షాల‌కు వివ‌రించారు. అయితే ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెలంగాణలో గ‌వ‌ర్న‌ర్ మార్పు అనివార్య‌మ‌ని తెలుస్తోంది.

West Bengal Governor Jagdeep Dhankhar may transfer to Telangana
Governor

తెలంగాణ‌కు ఇక‌పై తాను గ‌వ‌ర్న‌ర్‌గా ఉండ‌లేన‌ని త‌మిళిసై.. మోదీ, షాల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే ఆమె ఢిల్లీ వెళ్లిన‌ప్ప‌పుడు ఈ విష‌యాన్ని ఆమె చెప్పార‌ట‌. అయితే తాజాగా ఆమెను బ‌దిలీ చేస్తున్న‌ట్లు ఆమెకు చూచాయ‌గా ముందే స‌మాచారం అందించార‌ట‌. దీంతో ఆమెను పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా పంపించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక ఆమె స్థానంలో తెలంగాణ‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా జ‌గ్‌దీప్ ధన్‌ఖ‌ర్ నియామం కానున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

అయితే జ‌గ్‌దీప్ ధ‌న్‌ఖర్ ఇప్ప‌టికే దీదీ ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపించారు. ఆయ‌న ఆమెకు ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యార‌య్యారు. ఆయ‌న చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరుంది. దీంతో ఆయ‌నను తెలంగాణ‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ర‌ప్పిస్తే.. అప్పుడు సీఎం కేసీఆర్‌కు గుణ‌పాఠం చెబుతార‌ని అంటున్నారు. జ‌గ్‌దీప్ గ‌వ‌ర్న‌ర్‌గా వ‌స్తే సీఎం కేసీఆర్ ఆట‌లు సాగనివ్వ‌ర‌ని.. క‌నుక గ‌వ‌ర్న‌ర్‌గా ఆయ‌న ఎంపిక దాదాపు ఖ‌రారు అయినట్లు తెలుస్తోంది. రేపో మాపో ఉత్త‌ర్వులు జారీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం.

త‌మిళిసై వాస్త‌వానికి మృదు స్వ‌భావి. క‌నుక ఆమె క‌ఠిన‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. కాబ‌ట్టే ఆమెను బ‌దిలీ చేసి ఆమె స్థానంలో జ‌గ్‌దీప్‌కు ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యం నిజ‌మే అయితే రానున్న రోజుల్లో గ‌వ‌ర్న‌ర్‌కు, తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ముందు ముందు ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now