Kodali Nani : ఎన్‌టీఆర్ టీడీపీ సొత్తేమీ కాదు: కొడాలి నాని

June 29, 2022 2:43 PM

Kodali Nani : టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడును విమ‌ర్శించ‌డంలో మాజీ మంత్రి కొడాలి నాని ఒక స్టెప్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. చంద్ర‌బాబుతోపాటు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌పై కూడా కొడాలి నాని విరుచుకుప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుపై మ‌రోమారు నాని మండిప‌డ్డారు. గుడివాడ‌లోని బొమ్మ‌లూరు వ‌ద్ద ఉన్న ఎన్‌టీఆర్ విగ్ర‌హానికి కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నీలం, ఆకుప‌చ్చ రంగుల‌ను వేసేందుకు య‌త్నించారు. అయితే వెంట‌నే అక్క‌డికి చేరుకున్న టీడీపీ నాయ‌కులు ఎన్‌టీఆర్ విగ్ర‌హానికి పసుపు రంగు వేశారు. అనంత‌రం మాట్లాడుతూ కొడాలి నాని త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ఉప‌యోగిస్తున్నార‌ని ఆరోపించారు.

అయితే ఈ విష‌యంపై నాని స్పందించారు. ఎన్‌టీఆర్ అస‌లు టీడీపీకి చెందిన వారు కార‌ని.. చంద్ర‌బాబు గ‌తంలోనే ఈ విష‌యంపై ఎన్నిక‌ల సంఘానికి అఫిడ‌విట్‌లో తెలియ‌జేశార‌ని గుర్తు చేశారు. అలాంటి వ్య‌క్తి ఎన్‌టీఆర్ త‌మ మ‌నిష‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని అన్నారు. ఇదంతా ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి ఎన్నిక‌ల్లో ఓట్లు పొందేందుకే అని అన్నారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు, టీడీపీ నేతలు ఎన్‌టీఆర్ ఫొటోల‌ను పార్టీ ఆఫీసుల నుంచి తీయించార‌ని.. అలాంటి వారు ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం హాస్యాస్ప‌దం కాక మ‌రేమిట‌ని అన్నారు.

Kodali Nani says NTR does not belong to TDP
Kodali Nani

చంద్ర‌బాబు త‌న మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నాడ‌ని.. ఆయ‌న చ‌రిత్ర అంద‌రికీ తెలుస‌ని కొడాలి నాని అన్నారు. 1995లో ఎన్‌టీఆర్ నుంచి సీఎం పీఠాన్ని లాక్కుని ఆయ‌న చావుకు ఎవ‌రు కార‌ణ‌మ‌య్యారో అంద‌రికీ తెలుస‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now