Balakrishna : గోరంట్ల వ్యవహారంపై స్పందించిన బాలయ్య.. ఇంత చేసి సిగ్గులేకుండా ఇక్కడకు వచ్చాడు..

August 18, 2022 4:23 PM

Balakrishna : ఏపీలో సంచలనం రేపిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చిన వీడియో.. అధికార వైసీపీలో ప్రకంపనలు రేపింది. ఈ వీడియోపై విచారణ చేపట్టిన పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో ఒరిజనల్‌ది కాదని ఎడిట్ చేసి ఉండవచ్చని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా ఎంపీ మాధవ్ వీడియోపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ ఆయన మాట్లాడుతూ మాధవ్ ఘటనపై తొలిసారిగా స్పందించారు. మన ఎంపీ విచరక్షణా రహితంగా.. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి ఆయన సిగ్గులేకుండా జాతీయ వందనం చేయడానికి వచ్చాడు.

Balakrishna responded on MP Gorantla issue
Balakrishna

ఆయనను మన వాళ్లు (టీడీపీ నేతలు) అందరూ అడ్డుకున్నారు. ఎంతోమంది మీపై (కార్యకర్తలు) కేసులు పెట్టారు. వాళ్ల లాఠీల జులుం మీపై చూపించారు. వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వదిలే ప్రసక్తే లేదు. ప్రజలు అందరూ బయటకు రావాలి. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు. ప్రపంచ చరిత్ర తిరగరాసేందుకు ముందుకు రావాలి.. అంటూ బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఈలలతో హోరెత్తించారు. జై బాలయ్య.. జైజై బాలయ్య.. అంటూ నినాదాలు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now