Whatsapp : గూగుల్ పే లాగే వాట్సాప్‌లో ఆఫ‌ర్‌.. రూ.1 పంపితే రూ.51 వ‌స్తాయి..!

December 4, 2021 8:18 PM

Whatsapp : ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ మొద‌ట్లో తేజ్ పేరిట పేమెంట్స్ యాప్‌ను ప్రారంభించిన విష‌యం విదిత‌మే. అయితే దాన్ని త‌రువాత గూగుల్ పే గా మార్చారు. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డం కోసం అప్ప‌ట్లో గూగుల్‌లో క్యాష్‌బ్యాక్ ఇచ్చేవారు. దీంతో కొంద‌రు రూ.1 ల‌క్ష వ‌ర‌కు గెలుచుకున్నారు కూడా. అయితే ఇప్పుడు గూగుల్ పేలో అలాంటి క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌ను ఇవ్వడం లేదు. కానీ ఇదే త‌ర‌హా ఆఫ‌ర్‌ను ఇప్పుడు వాట్సాప్ ప్రారంభించింది.

Whatsapp pay offers rs 51 cash back even if you send 1 rupee

వాట్సాప్‌లో పేమెంట్స్ సేవ‌ల‌ను గ‌తంలోనే ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డం కోసం వాట్సాప్ తాజాగా క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. కేవ‌లం రూ.1 న‌గదును బ‌దిలీ చేసినా చాలు రూ.51 క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. ఈ ఆఫ‌ర్ ప్ర‌స్తుతం వాట్సాప్‌లో పేమెంట్లు చేసే వారికి అందుబాటులో ఉంది.

వాట్సాప్‌లో రూ.1 ట్రాన్స్‌ఫ‌ర్ చేసినా చాలు రూ.51 క్యాష్ బ్యాక్ వ‌స్తుంది. న‌గ‌దు పంపిన వెంట‌నే క్యాష్ బ్యాక్ మ‌న ఖాతాలో జ‌మ అవుతుంది. అయితే ఈ ఆఫ‌ర్ కేవ‌లం 5 ట్రాన్సాక్ష‌న్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అది కూడా ఎంపిక చేసిన వినియోగ‌దారుల‌కే అందుబాటులో ఉంది. క‌నుక ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుందా, లేదా అన్న‌ది చెక్ చేయాలంటే.. వాట్సాప్‌లో డ‌బ్బులు పంపి చూడాలి. ఒక వేళ వ‌స్తే.. ఇంకో నాలుగు సార్లు డ‌బ్బులు పంపుకుని, పంపిన‌ప్పుడల్లా ఎంచక్కా రూ.51 క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now