వాట్సాప్‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

August 19, 2022 2:26 PM

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న యూజ‌ర్ల‌కు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే అనేక ర‌కాల స‌దుపాయాలు అందులో అందుబాటులో ఉన్నాయి. ఇక త్వ‌ర‌లోనే మరో అద్భుత‌మైన ఫీచ‌ర్‌ను యూజ‌ర్ల‌కు అందించ‌నుంది. అయితే ఆ ఫీచ‌ర్ ఇప్ప‌టికే ఉన్నా.. దానికి మరిన్ని మెరుగులు దిద్ది మళ్లీ కొత్త‌గా అందించేందుకు సిద్ధ‌మవుతోంది.

వాట్సాప్‌లో మ‌నం పంపుకునే మెసేజ్‌ల‌ను వెంట‌నే డిలీట్ చేసే స‌దుపాయం కూడా ఉన్న విష‌యం విదిత‌మే. అయితే మొద‌ట్లో మ‌నం పంపుకునే మెసేజ్‌ల‌ను డిలీట్ చేసేందుకు 7 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ఇచ్చేవారు. త‌రువాత మెసేజ్‌లు డిలీట్ అయ్యేవి కావు. కానీ త‌రువాత అదే స‌మ‌యాన్ని పెంచారు. పంపిన మెసేజ్ ల‌ను డిలీట్ చేసేందుకు త‌రువాత స‌మ‌యాన్ని ఒక గంట 8 నిమిషాల 16 సెక‌న్ల‌కు పెంచారు. అయితే ఇప్పుడు ఇదే స‌మ‌యాన్ని మళ్లీ పెంచ‌నున్నారు.

whatsapp to give more time to delete messages for users

ఇక‌పై మ‌నం వాట్సాప్ లో పంపే ఏ మెసేజ్‌ను అయినా స‌రే 2 రోజుల త‌రువాత కూడా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా డిలీట్ చేయ‌వ‌చ్చు. వాట్సాప్ లో పంపే మెసేజ్ ల‌ను డిలీట్ చేసేందుకు స‌మ‌యాన్ని ఏకంగా 2 రోజుల 12 గంట‌ల వ‌ర‌కు పెంచారు. దీంతో యూజ‌ర్ల‌కు మెసేజ్ ల‌ను డిలీట్ చేసేందుకు మ‌రింత ఎక్కువ సమ‌యం ల‌భ్యం కానుంది. అయితే ప్ర‌స్తుతానికి ఈ ఫీచ‌ర్‌ను బీటా యాప్‌లో టెస్ట్ చేస్తున్నారు. దీన్ని త్వ‌ర‌లోనే యూజ‌ర్లు అంద‌రికీ పూర్తి స్థాయిలో అందించ‌నున్నారు. ఇక ఇదే కాకుండా మ‌రిన్ని ప్రైవ‌సీ ఫీచ‌ర్ల‌ను కూడా వాట్సాప్ త్వ‌ర‌లోనే యూజ‌ర్ల‌కు అందించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment