మంగళవారం, జూన్ 30, 2026
టెక్నాల‌జీ

Whatsapp : ఐఫోన్ వినియోగదారుల‌కు భారీ షాక్‌.. ఇక‌పై ఆ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు..!

Whatsapp : ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు షాకిచ్చింది. ఇక‌పై కొన్ని ర‌కాల ఐఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌ద‌ని తెలిపింది. ఈ మేర‌కు డబ్ల్యూఏ బీటా ఇన్‌ఫో అనే వాట్సాప్ ట్రాక‌ర్ ఈ వివ‌రాల‌ను తెలియ‌జేసింది.…

Whatsapp : ఐఫోన్ వినియోగదారుల‌కు భారీ షాక్‌.. ఇక‌పై ఆ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు..!

Whatsapp : ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు షాకిచ్చింది. ఇక‌పై కొన్ని ర‌కాల ఐఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌ద‌ని తెలిపింది. ఈ మేర‌కు డబ్ల్యూఏ బీటా ఇన్‌ఫో అనే వాట్సాప్ ట్రాక‌ర్ ఈ వివ‌రాల‌ను తెలియ‌జేసింది. ఇక‌పై ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఉన్న ఐఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు. క‌నుక యూజ‌ర్లు క‌నీసం ఐఓఎస్ 12 వెర్ష‌న్ ఉన్న ఐఫోన్ల‌ను అయినా స‌రే వాడాల్సి ఉంది.

ఐఓఎస్ 10, 11 ఓఎస్‌లు ప్ర‌స్తుతం ఐఫోన్ 5, 5సి ఫోన్ల‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఈ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు. వాట్సాప్ నుంచి వ‌చ్చే అప్ డేట్స్‌ను ఈ ఫోన్ల‌ను వాడుతున్న‌వారు ఇన్‌స్టాల్ చేసుకోలేరు. ఈ ఫోన్ల‌కు వాట్సాప్ స‌పోర్ట్ ల‌భించ‌దు. క‌నుక ఈ ఫోన్ల‌ను వాడుతున్న వారు ఐఓఎస్ 12 ఉండే ఐఫోన్ 5ఎస్, 6, 6ఎస్ ఫోన్ల‌ను అయినా వాడాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్‌ను ఉప‌యోగించుకోలేరు.

soon Whatsapp wll not work on these iOS devices
Whatsapp

ఇక వాట్సాప్ త‌న యూజ‌ర్ల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూనే వ‌స్తోంది. అందులో భాగంగానే త్వ‌ర‌లోనే మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను అందించ‌నుంది. లీవ్ గ్రూప్స్ సైలెంట్లీ, రిచ్ లింక్ ప్రివ్యూస్‌, కంపానియ‌న్ మోడ్‌, సెర్చ్ ఫిల్ట‌రింగ్ వంటి ప‌లు ఫీచ‌ర్ల‌ను వాట్సాప్ రానున్న రోజుల్లో అందించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి