మంగళవారం, జూన్ 30, 2026
టెక్నాల‌జీ

Whatsapp : షాకింగ్‌.. 17.5 లక్షల అకౌంట్లను తొలగించిన వాట్సాప్‌..!

Whatsapp : దేశవ్యాప్తంగా నవంబర్ నెలలో ఏకంగా 17 లక్షలకు పైగా అకౌంట్లను తొలగించామని ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 నవంబర్‌ నెలలో మొత్తం 602 ఫిర్యాదులు వచ్చాయని, వాటిల్లో 36…

Whatsapp : షాకింగ్‌.. 17.5 లక్షల అకౌంట్లను తొలగించిన వాట్సాప్‌..!

Whatsapp : దేశవ్యాప్తంగా నవంబర్ నెలలో ఏకంగా 17 లక్షలకు పైగా అకౌంట్లను తొలగించామని ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 నవంబర్‌ నెలలో మొత్తం 602 ఫిర్యాదులు వచ్చాయని, వాటిల్లో 36 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఈ క్రమంలోనే నవంబర్‌ నెలలోనే ఏకంగా 17,59,000 అకౌంట్లను తొలగించామని వాట్సాప్‌ తెలియజేసింది.

Whatsapp banned over 17 lakhs of accounts in india in november

వాట్సాప్‌లో యూజర్ల భద్రతే తమకు ముఖ్యమని ఆ సంస్థ తెలియజేసింది. యూజర్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. వాట్సాప్‌లో ఎలాంటి వేధింపులకు తావు లేకుండా చూస్తున్నామని స్పష్టం చేసింది.

వాట్సాప్‌ ప్లాట్‌ఫాంపై యూజర్లకు ఇప్పటికే ఎన్నో సేవలను అందిస్తున్నామని.. ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ టెక్నాలజీతో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తున్నామని, దీని వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణల గురించి మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదన్నారు.

కాగా అక్టోబర్‌ 2021లో వాట్సాప్‌కు మొత్తం 500 ఫిర్యాదులు అందగా ఆ నెలలో 20 లక్షల అకౌంట్లను రద్దు చేసింది. వాటిల్లో ఎక్కువగా బల్క్‌ మెసేజ్‌లను దురుద్దేశంతో వాడినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందువల్లే ఆ వాట్సాప్‌ అకౌంట్లను నిషేధించారు. ఇక వాట్సాప్‌కు దేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి