Upasana Konidela : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..? త‌ల్లి కాబోతున్న ఉపాస‌న‌..? ఫొటోలో క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంది..!

September 6, 2022 5:29 PM

Upasana Konidela : మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మెగా కోడలిగా ఇంటి బాధ్య‌త‌ల‌ను, రామ్ చ‌ర‌ణ్ వ్యాపారాల‌ను చూసుకుంటున్న ఆమె మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా చూసుకుంటూ ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇక అన్ని విధాలుగా ఎంతో బిజీగా ఉంటున్న‌ప్ప‌టికీ ఉపాస‌న మాత్రం సోష‌ల్ మీడియాలో అంద‌రికీ చేరువ‌గానే ఉంటారు. అలాగే త‌న‌కు తెలిసిన వాళ్ల ఇండ్ల‌లో జ‌రిగే ఫంక్ష‌న్ల‌కు కూడా వెళ్తుంటారు.

అయితే ఉపాసన, రాంచరణ్ ల వివాహం అయి 10 సంవత్సరాలు గ‌డిచాయి. ఉపాసన సొసైటీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఇంకా పిల్లలు లేరనే మాటలు వింటూ ఎంతో బాధ‌కు గుర‌వుతుంటారు. ఎన్నోసార్లు ఈ విషయంపై ప్రశ్నలు ఎదురవగా తాను పిల్లలు కనడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని సమయం వచ్చినప్పుడు తానే సమాధానం చెబుతా అంటూ దాటవేస్తూ వ‌చ్చారు.

Upasana Konidela reportedly pregnant photo viral
Upasana Konidela

అయితే తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన సైతం తన డ్రైవర్ ఇంటికి గణేష్ నిమజ్జనం కోసం వెళ్లారు. అలా ఈమె గణేష్ నిమజ్జనంలో సందడి చేస్తున్న సమయంలో ఈమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించడంతో ఉపాసన ప్రెగ్నెంటా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఉపాసన, రాంచరణ్ గణేష్ విగ్రహం పట్టుకున్నటువంటి ఫోటోలో కూడా ఈమె బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తోంది.

ఈ విధంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో భాగంగా సందడి చేసిన ఉపాసన ఒక్కసారిగా బేబీ బంప్ తో కనిపించడంతో మెగా అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉపాసనలో కూడా శారీరకంగా మార్పులు చోటు చేసుకోవడంతో ఈమె కచ్చితంగా గర్భం దాల్చిందని అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదని పలువురు భావిస్తున్నారు. అయితే ఇది నిజమైతే త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించనున్నారు. ఇక ఈమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now