Upasana Konidela : రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది.. ఊహించ‌లేరు..!

October 9, 2022 8:23 PM

Upasana Konidela : టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ 2012, జూన్ 14న ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. కాలేజీ రోజుల్లోనే ప్రేమికులుగా ఉండి.. ఆ తర్వాత తమ ప్రేమను వివాహబంధంతో ఒక్కటైన వీరిద్ధరూ.. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం స్టార్ హీరో వైఫ్ గానే కాకుండా ఉపాసన తనకంటూ స్పెషల్ ఇమేజ్ కలిగి ఉంది. ఆమె మహిళా వ్యాపారవేత్త, సోషల్ ఆక్టివిస్ట్.

అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్. అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టిపిఏ లిమిటెడ్ డైరెక్టర్ కూడా. బి పాజిటివ్ పేరుతో ఓ ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కూడా నడుపుతున్నారు. ఉపాసన అనేక నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి ప్రాతినిధ్యం వహించింది. ఇక ఉపాసన పేరిట ఉన్న ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. టాలీవుడ్ హీరోల భార్యలలో ఉపాసన అందరి కంటే చాలా రిచ్. ఉపాసన దోమకొండ సంస్థానం వారసురాలు. కామినేని ప్రతాప్ రెడ్డి మనవరాలు, అనిల్ కుమార్ కూతురు. అపోలో గ్రూప్ వాటాదారు కూడా.

Upasana Konidela total assets value you will be surprised
Upasana Konidela

ఒక అంచనా ప్రకారం ఉపాసన వాటా విలువ రూ.8 నుండి 10 వేల కోట్ల రూపాయలు ఉంటుందట. ఇక స్థిర, చర ఆస్తుల రూపంలో 100 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల ఆస్తులు మొత్తం కలిపినా ఉపాసనకు ఉన్న సంపదకు సమానం కాదట. అంత సంపద ఉన్నా ఉపాసన చాలా నిరాడంబరంగా ఉంటారు. రిలేషన్స్ కి బాగా విలువ ఇస్తారు. అదే సమయంలో ఉపాసన మెగా వారసుడికి జన్మనివ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు. జీవితంలో పిల్లలు కనడం కంటే ముఖ్యమైన విషయాలు అనేకం ఉన్నాయి. ఇంత కంటే నేను ఏమి మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తారని ఉపాసన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now