Upasana Konidela : ఉపాస‌న సంచ‌ల‌న నిర్ణ‌యం.. సంతోషం వ్య‌క్తం చేస్తున్న మెగా ఫ్యాన్స్‌..!

June 26, 2022 4:29 PM

Upasana Konidela : మెగా కోడ‌లు కొణిదెల ఉపాస‌న త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటున్నారు. ఆమె ఓ వైపు వ్యాపారాల‌ను చూసుకుంటూనే మ‌రోవైపు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంటారు. ఈ మ‌ధ్యే వివాహ వార్షికోత్సవం సంద‌ర్భంగా ఆమె భ‌ర్త చ‌ర‌ణ్ తో క‌లిసి యూర‌ప్ ట్రిప్‌కు వెళ్లి వ‌చ్చారు. ఇక మూగ‌జీవాల ప‌ట్ల ఉపాస‌న ఎంతో క‌రుణ చూపిస్తుంటారు. ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ‌, మూగ జంతువులు, పేద‌ల‌కు స‌హాయం వంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డంలో ఆమె ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఉపాస‌న‌ను అంద‌రూ అభినందిస్తుంటారు. ఆమె చేసే మంచి ప‌నుల‌కు అంద‌రూ ముగ్ధులు అవుతుంటారు.

ఉపాస‌న మెగా ఫ్యామిలీకి కోడ‌లు అయిన‌ప్ప‌టి నుంచి వారి ప‌రువు, ప్ర‌తిష్ట‌ను ఒక మెట్టు పెంచిందే త‌ప్ప త‌గ్గించ‌లేదు. అంత ప‌ద్ధ‌తిగా ఉంటారు. ఇక లేటెస్ట్‌గా ఆమె అపోలో హాస్పిట‌ల్‌కు చెందిన వైద్య సేవ‌ల గురించి ఒక పోస్ట్ పెట్టారు. ఆమెకు వ‌న్య ప్రాణులు అన్నా.. అట‌వీ సంర‌క్ష‌ణ అన్నా చాలా ఇష్టం చూపిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఇంటితోపాటు ఫామ్ హౌస్‌లోనూ ఇప్ప‌టికే అనే ర‌కాల జంతువుల‌ను చేర‌దీసి పెంచుతున్నారు. ఇక జూలోనూ ప‌లు జంతువుల‌ను ఆమె ఇప్ప‌టికే ద‌త్త‌త తీసుకుని వాటి సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను చూస్తున్నారు.

Upasana Konidela announced free hospital treatment for them
Upasana Konidela

గ‌తంలో ఉపాస‌న ఒక‌సారి ఓ పులి పిల్ల‌ను ఏకంగా త‌న ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. అంతేకాదు దానికి పాలు త‌గించారు. దీంతో ఉపాస‌న ధైర్యం చూసి అంద‌రూ షాక‌య్యారు. ఇక ఉపాస‌న మ‌ళ్లీ త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు. స్వ‌త‌హాగా జంతు ప్రేమికురాలు అయిన ఉపాస‌న వాటి సంర‌క్ష‌ణ కోసం ఆలోచించారు. ఈ క్ర‌మంలోనే జంతువులు, వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం ఉప‌యోగ‌ప‌డే ఓ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

వ‌న్య‌ప్రాణులు, జంతువులు, ఇత‌ర మూగ‌జీవాలు, జీవ‌రాశుల సంర‌క్ష‌ణ కోసం ప‌నిచేసేవారికి ఉచితంగా వైద్యాన్ని అందించాల‌ని ఉపాస‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఆమె ఒక పోస్ట్ పెట్టారు. ఇందుకు గాను అపోలో ఫౌండేష‌న్‌, డ‌బ్ల్యూడ‌బ్ల్యూఎఫ్ (WWF)తో కలిసి ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఉపాస‌న తీసుకున్న ఈ మంచి నిర్ణ‌యాన్ని అంద‌రూ స్వాగతిస్తున్నారు. ఆమెలోని మంచి గుణాన్ని కొనియాడుతున్నారు. మెగా ఫ్యాన్స్ ఈ సంద‌ర్భంగా ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now