Upasana Konidela : మ‌ళ్లీ మంచి మ‌న‌సు చాటుకున్న ఉపాస‌న‌.. భేష్ అంటున్న నెటిజ‌న్లు..

September 3, 2022 2:50 PM

Upasana Konidela : కొణిదెల వారి ఇంటి కోడలు ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉపాసన అనగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్ పర్సన్ అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఉపాసన సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా రంగంతో ఎక్కువ ట‌చ్ లేక‌పోయినా సినీ అభిమానులకు, భర్తకు సంబంధించిన విషయాల‌ను షేర్ చేసుకుంటూ మెగా ఫాన్స్ తో మంచి అనుబంధం ఏర్పరుచుకున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసన వీలు తోచినప్పుడల్లా సామజిక కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఉపాసన చేసే మంచి పనులతో ఇటు పుట్టింటికి, అటు మెట్టినింటి వారికి కూడా మంచి పేరు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ఉపాసన తాజాగా మరోసారి ఇంకో పనికి శ్రీకారం చుట్టి తన మంచి మనసు చాటుకున్నారు. మెట్టినింటిలోనే కాకుండా సమాజంలో కూడా ఉపాసనకు ఎంతో మంచి పేరు ఉంది.

Upasana Konidela said to build a school netizen praise her
Upasana Konidela

లక్ష్మణ్ అనే వ్యక్తి ఉపాసన ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఓసారి మాటల సందర్భంలో బస్తీ పిల్లల కోసం స్కూల్ కట్టించడానికి రెడీగా ఉన్నానని ఉపాసన అన్నారు. అప్పుడు చెప్పినట్లుగానే మాట మీద నిలబడ్డారని, అపోలో ఫౌండేషన్ ద్వారా త్వరలో స్కూల్ కట్టించబోతున్నారు అమ్మ గారు అని లక్ష్మణ్ చెబుతూ ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు.

తాజాగా ఆ బస్తీలో జరిగిన వినాయక చవితి వేడుకకు అతిథిగా వచ్చారు ఉపాసన. లక్ష్మణ్ మా ఇంటిలో ముఖ్యమైన వ్యక్తి. అతనికి కావలసిన సహాయం అందించడంలో నేను ఎప్పుడూ ముందే ఉంటాను అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బస్తీలో కట్టబోయే స్కూల్ గురించి కూడా ఉపాసన మీడియాతో సంభాషించారు. ఉపాసన ఎంత అందంగా ఉంటారో ఆమె మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మరోసారి చాటి చెప్పారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now