Upasana : చీర‌క‌ట్టులో ఆక‌ర్షణీయంగా క‌నిపిస్తున్న‌.. ఉపాస‌న‌..!

January 28, 2022 3:38 PM

Upasana : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో వివాదానికి కార‌ణ‌మైంది. ఓ ఆల‌య గోపురంపై మ‌నుషులు ఉన్న‌ట్లుగా ఎడిట్ చేసిన ఓ ఫొటోను ఆమె షేర్ చేసింది. దీంతో ఆమెను నెటిజ‌న్లు తీవ్రంగా విమ‌ర్శిస్తూ ట్రోల్ చేశారు. అయితే ఉపాస‌న తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.

Upasana in saree latest photo shared by her become viral

అయితే ఉపాస‌న తాజాగా షేర్ చేసింది త‌న ఫొటోనే. అచ్చ‌మైన సంప్ర‌దాయ‌బ‌ద్ద‌మైన వేష‌ధార‌ణ‌లో చీర‌క‌ట్టుతో క్యూట్ లుక్స్‌లో ఆమె ద‌ర్శ‌న‌మిస్తున్నారు. అదే ఫొటోను ఆమె షేర్ చేశారు. సాధార‌ణంగా ఆమె బిజినెస్ సూట్స్ లేదా చుడీదార్‌ల‌లో ద‌ర్శ‌నిమ‌స్తుంటారు. కానీ తాజాగా చీర‌క‌ట్టులో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచారు. దీంతో ఆమె చీర‌క‌ట్టు ఫొటో వైర‌ల్ గా మారింది.

ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. ఫ్రీడ‌మ్ స్టెమ్స్ ఫ్ర‌మ్ ది ఇన్‌సైడ్‌.. బీ ఫ్రీ, ఫియ‌ర్‌లెస్‌, ఫ్లోరిష్‌.. అనే కామెంట్ పెట్టారు. మీ ఇష్ట‌మైన వ‌స్త్ర‌ధార‌ణ‌లో మీరు ఉండండి, స్వేచ్ఛ‌గా జీవించండి, ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు.. అంటూ ఆమె కాప్ష‌న్ పెట్టారు.

ఇక రిప‌బ్లిక్ డే నాడు షేర్ చేసిన ఫొటోకు కొంద‌రు విమ‌ర్శించ‌డంతో దానికి కౌంట‌ర్‌గానే ఆమె ఈ ఫోటోను షేర్ చేశారా..? అని కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉపాస‌న చీర‌క‌ట్టు ఫొటో మాత్రం ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment