Upasana : పండగ మూడ్ లో చరణ్ దంపతులు.. చరణ్ లుక్ అదిరిపోయిందిగా..!

October 2, 2022 9:44 PM

Upasana : టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ రోజుల్లోనే ప్రేమికులుగా ఉండి.. ఆ తర్వాత తమ ప్రేమను వివాహబంధంతో ఒక్కటైన వీరిద్ధరూ.. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చరణ్ గురించి ఎప్పుడూ ఉపాసన.. తన భార్య గురించి చరణ్ పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలను పంచుకుంటుంటారు. ఇక చరణ్ విషయానికి వస్తే.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ.. ఫర్ఫెక్ట్ ఫ్యామిలీమెన్ గా పేరు తెచ్చుకున్నాడు. కాస్త సమయం దొరికినా కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ షూటింగ్ బ్రేక్ లో ఉన్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ ఆర్సీ-15 చిత్రీకరణ తాత్కాలింగా ఆగిపోయింది. దర్శకుడు శంకర్ భారతీయుడు 2 చిత్రీకరణ తిరిగి ప్రారంభించడంతో చరణ్ మూవీ షూట్ ఆగిపోయింది. కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 మూవీ వివాదాల కారణంగా ఆగిపోయింది. ఇటీవల శంకర్ కి, నిర్మాతలకు మధ్య సంధి కుదిరింది. దీంతో భారతీయుడు 2 మిగిలిన చిత్రీకరణ పూర్తి చేయడానికి శంకర్ ముందుకు వచ్చాడు. భారతీయుడు 2 నుండి శంకర్ బయటకు వచ్చే వరకు రామ్ చరణ్ వేచి చూడాల్సిందే.

Upasana and Ram Charan appeared in Dussehra costumes
Upasana

ఈ విరామ సమయాన్ని శంకర్ ఫ్యామిలీకి కేటాయిస్తున్నాడు. ఇటీవల సిస్టర్స్ శ్రీజ‌, సుస్మితలను తీసుకుని ఫారిన్ ట్రిప్ కి వెళ్ళాడు చరణ్. ఆ టైంలో బిజీగా ఉన్న ఉపాసన ఆ ట్రిప్ లో పాల్గొనలేకపోయింది. అయితే దసరా పండుగను ఆమె భర్త చరణ్ తో కలిసి జరుపుకుంటుంది. ఆదివారం నేపథ్యంలో ఉపాసన సైతం ఇంట్లోనే ఉంది. దీంతో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఉపాసన పండగ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఉపాసన బ్లూ ట్రెండీ వేర్ ధరించగా.. చరణ్ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టాడు. ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now