Upasana : మెగా కోడ‌లు ఉపాస‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతుందా ? అస‌లు విష‌యం ఏమిటి ?

August 22, 2022 9:46 AM

Upasana : మెగా కోడ‌లిగా ఎంతో గుర్తింపు పొందిన కొణిదెల ఉపాస‌న ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. మొన్నీ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మంలో స‌ద్గురుతో ఆమె మాట్లాడిన మాట‌లు వైర‌ల్ అయ్యాయి. చ‌ర‌ణ్‌, ఉపాస‌న కావాల‌నే పిల్ల‌ల్ని క‌న‌డం లేద‌ని.. అందుకు స‌ద్గురు వారిని అభినందించార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. పెళ్ల‌య్యాక 10 ఏళ్ల త‌రువాతే వారు పిల్ల‌ల్ని క‌నాల‌ని అనుకున్నార‌ని.. క‌నుక ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తి అయ్యాయి కాబ‌ట్టి ఇక ఈ సంవ‌త్స‌రం చ‌ర‌ణ్‌, ఉపాస‌న కుటుంబంలోకి ఓ కొత్త వ్య‌క్తి వస్తారు.. అని ఫ్యాన్స్ తెగ ప్ర‌చారం చేశారు. అయితే త‌రువాత దీనిపై ఉపాస‌న క్లారిటీ ఇచ్చారు.

ఇక ఉపాస‌న ఈ మ‌ధ్యే క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆమె ఆరోగ్యంపై అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె హెల్త్ కండిష‌న్ సీరియ‌స్‌గా ఉంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేద‌ని స్ప‌ష్ట‌మైంది. తాజాగా ఆమె త‌న ఇంట్లో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం చేసి చ‌ర‌ణ్ ఆశీస్సుల‌ను తీసుకున్నారు. దీంతో ఆమె ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోను షేర్ చేశారు. అందులో ఆమె ఆరోగ్యంగానే క‌నిపించారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టిన‌ట్లు అయింది.

is Upasana health condition not good what is the truth
Upasana

ఇక చ‌రణ్‌, ఉపాస‌న విడిపోతున్నార‌ని కూడా కొంద‌రు ప్ర‌చారం చేశారు. కానీ ఆ ఒక్క ఫొటో ద్వారా ఉపాస‌న పుకార్ల‌న్నింటికీ చెక్ పెట్టిన‌ట్లు అయింది. చ‌ర‌ణ్‌తో ఆమె ఎంతో స‌న్నిహితంగా ఉండ‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. అయితే మెగా ఫ్యామిలీపై పుకార్లు రావ‌డం కొత్తేమీ కాదు. కానీ ఈ మ‌ధ్య కాలంలో పుకార్లు ఎక్కువ‌య్యాయి. మొన్నీ మ‌ధ్యే నిహారిక త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకుంద‌ని ప్ర‌చారం చేశారు. కానీ అందులో నిజం లేద‌ని తేలిపోయింది. ఇక శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్ దంప‌తుల గురించి కూడా వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి. అయితే వారి విష‌య‌మే ఎటూ తేల‌డం లేదు. కాగా చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తుండ‌గా.. ఆ మూవీ షూటింగ్ ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తేలాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now