Ram Charan : రామ్ చరణ్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవుతారు.. ఉపాసన కట్నంగా ఎంత తీసుకొచ్చిందంటే..?

November 24, 2022 11:29 AM

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం నటుడిగానే కాకుండా పలు రకాల పాత్రలు పోషిస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి చరణ్ ఆస్తుల విలువ. రామ్ చరణ్ లగ్జరీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హాట్ టాపిక్ గా మారింది. హీరో గానే కాకుండా, పలువు యాడ్స్ లో నటించడం ద్వారా, నిర్మాతగా కూడా చాలా ఆస్తుల సంపాదించాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Charan properties and assets value
Ram Charan

రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ ను ప్రారంభించి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నెట్ వార్త్ దాదాపుగా 200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం వినిపిస్తుంది. అదేవిధంగా రామ్ చరణ్ కు గుర్రాలు అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ కు 20 కోట్ల విలువ చేసే పోలో క్లబ్ కూడా ఉంది. రామ్ చరణ్ అపోలో ఎం.డి కూతురు ఉపాసనను 2012లో వివాహం చేసుకున్నారు. దాంతో రాంచరణ్ కు అపోలో ఆసుపత్రిలో సైతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు రామ్ చరణ్ వద్ద రోల్స్ రాయల్స్, రేంజ్ రోవర్, ఫెరారీ కార్లు ఉన్నాయి.

అంతేకాకుండా రామ్ చరణ్ చేతికి ధరించే గడియారం ధర 30 నుండి 75 లక్షల వరకు ఉంటుందట. ఇటీవల రాంచరణ్, ఉపాసన దంపతులు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దాని విలువ సుమారు రూ.60 కోట్లు అని తెలుస్తోంది. ఇక  దక్షిణాదిలో పరిశీలిస్తే ఇంత విలాసవంతమైన ఇల్లు కలిగిన హీరోల్లో రామ్ చరణ్ టాప్ అని ఓ ఆంగ్ల వెబ్‌సైట్ అంచనా వేయడం మరింత చర్చనీయాంశమైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now