గురువారం, జూన్ 11, 2026
క్రీడ‌లు

Under 19 Cricket World Cup 2022 : అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్.. మ‌ళ్లీ భార‌త్‌దే ట్రోఫీ.. ఇది భార‌త్‌కు 5వ టైటిల్‌..!

Under 19 Cricket World Cup 2022 : భార‌త యువ క్రికెట్ ప్లేయ‌ర్ల స‌త్తా మ‌రోమారు ప్ర‌పంచానికి తెలిసింది. ఐసీసీ టోర్నీల్లో ఆధిప‌త్యం చెలాయించ‌గ‌ల‌మ‌ని మ‌రోమారు భార‌త జ‌ట్టు నిరూపించింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన అండ‌ర్ 19 క్రికెట్…

Under 19 Cricket World Cup 2022 : అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్.. మ‌ళ్లీ భార‌త్‌దే ట్రోఫీ.. ఇది భార‌త్‌కు 5వ టైటిల్‌..!

Under 19 Cricket World Cup 2022 : భార‌త యువ క్రికెట్ ప్లేయ‌ర్ల స‌త్తా మ‌రోమారు ప్ర‌పంచానికి తెలిసింది. ఐసీసీ టోర్నీల్లో ఆధిప‌త్యం చెలాయించ‌గ‌ల‌మ‌ని మ‌రోమారు భార‌త జ‌ట్టు నిరూపించింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో జ‌యభేరిని మోగించింది. మ‌రోమారు యువ జ‌ట్టు భార‌త క్రికెట్ ఖ్యాతిని న‌లుదిశ‌లా వ్యాప్తి చేసింది.

Under 19 Cricket World Cup 2022 India won by 4 wickets against England in final match
Under 19 Cricket World Cup 2022

భార‌త్‌, ఇంగ్లండ్‌ల మ‌ధ్య జరిగిన అండ‌ర్ 19 క్రికెట్ వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో.. ఇంగ్లండ్‌పై భార‌త్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ నెమ్మ‌దిగా ఆచి తూచి ఆడుతూ ఛేదించింది. దీంతో మ‌రోమారు అండ‌ర్ 19 టీమ్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను గెలుచుకుంది. ఇది భార‌త్ అండ‌ర్ 19 జ‌ట్టుకు వ‌రుస‌గా 5వ టైటిల్ కావడం విశేషం.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ అండర్ 19 జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్లు కూడా ఆడ‌లేదు. 44.5 ఓవ‌ర్ల‌లోనే ఆలౌట్ అయింది. 189 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో జేమ్స్ రో (95) మిన‌హా ఎవ‌రూ ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఇక భార‌త అండ‌ర్ 19 జ‌ట్టు బౌల‌ర్ల‌లో రాజ్ బ‌వా ఏకంగా 5 వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లండ్ అండ‌ర్ 19 జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు. అలాగే మ‌రో బౌల‌ర్ ర‌వికుమార్ 4 వికెట్లు తీశాడు. కౌశ‌ల్ తంబెకు 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ 47.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌ను కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. 195 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో షేక్ ర‌షీద్ 50, నిశాంత్ సంధు 50, రాజ్ బ‌వా 35 ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జోషువా బోయ్‌డెన్‌, జేమ్స్ సేల్స్‌, థామ‌స్ ఆస్పిన్ వాల్‌ల‌కు త‌లా 2 వికెట్లు ద‌క్కాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి