India Vs West Indies : వెస్ట్ ఇండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భార‌త్‌.. సిరీస్ 3-0 తో కైవ‌సం..!

February 11, 2022 10:14 PM

India Vs West Indies : అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలోనూ భార‌త్.. వెస్టిండీస్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. భారత్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో విండీస్ జ‌ట్టు త‌డ‌బ‌డింది. దీంతో ఆ జ‌ట్టు మ‌ళ్లీ త‌క్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఈ క్ర‌మంలో విండీస్‌పై భార‌త్ 96 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. సిరీస్‌ను 3-0 తేడాతో భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది.

India Vs West Indies India won by 96 runs against West Indies and clean sweep series
India Vs West Indies

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలోనే భార‌త జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 265 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో శ్రేయాస్ అయ్య‌ర్ 111 బంతుల్లో 9 ఫోర్ల‌తో 80 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకోగా రిష‌బ్ పంత్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 56 ప‌రుగులు చేశాడు. అలాగే దీప‌క్ చాహ‌ర్ (38), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (33) చివ‌ర్లో మెరుపులు మెరిపించారు. దీంతో భార‌త్ భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. విండీస్ బౌల‌ర్ల‌లో జేస‌న్ హోల్డ‌ర్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా జోసెఫ్‌, హేడెన్ వాల్ష్‌లు చెరో 2 వికెట్లు తీశారు. ఓడియ‌న్ స్మిత్‌, ఫేబియ‌న్ అల‌న్‌ల‌కు చెరో 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జ‌ట్టు 37.1 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడి 169 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో ఓడియ‌న్ స్మిత్ (36), నికోలాస్ పూర‌న్ (34) మిన‌హా ఎవ‌రూ ఆక‌ట్టుకునే ప్ర‌దర్శ‌న చేయ‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిధ్ కృష్ణ‌లు చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. కుల్దీప్ యాద‌వ్‌, దీప‌క్ చాహ‌ర్‌లు చెరో 2 వికెట్లు తీశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now