India Vs West Indies : రెండో వ‌న్డేలోనూ భార‌త్‌దే గెలుపు.. 2-0 తో సిరీస్ లో ఆధిక్యం..

February 9, 2022 9:42 PM

India Vs West Indies : అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భార‌త్ సునాయాసంగా విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో వెస్టిండీస్ త‌డ‌బ‌డింది. ల‌క్ష్యం త‌క్కువే అయిన‌ప్ప‌టికీ వెస్టిండీస్ సాధించ‌లేక చేతులెత్తేసింది. దీంతో విండీస్‌పై భార‌త్ 44 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మూడు వ‌న్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది.

India Vs West Indies India won by 44 runs against West Indies in 2nd ODI
India Vs West Indies

మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలోనే భార‌త జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 237 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో సూర్య కుమార్ యాద‌వ్‌, కేఎల్ రాహుల్ రాణించారు. 83 బంతులు ఆడిన యాద‌వ్ 5 ఫోర్ల‌తో 64 ప‌రుగులు చేయ‌గా.. 48 బంతుల్లో రాహుల్ 4 ఫోర్లు, 2 సిక్సర్ల‌తో 49 ప‌రుగులు చేశాడు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో జోసెఫ్‌, ఓడియ‌న్ స్మిత్‌లు చెరో 2 వికెట్లు తీశారు. కీమర్ రోచ్‌, జేస‌న్ హోల్డ‌ర్‌, అకియ‌ల్ హోసెయిన్‌, ఫేబియ‌న్ అల‌న్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 46 ఓవ‌ర్ల‌లోనే ఆలౌట్ అయింది. కేవ‌లం 193 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో ష‌మ‌ర్ బ్రూక్స్ (44 ప‌రుగులు) మిన‌హా ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో ప్రసిధ్ కృష్ణ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. అలాగే సిరాజ్‌, చాహ‌ల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, దీప‌క్ హుడాల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది. ఈ సిరీస్‌లో చివ‌రిదైన వన్డే మ్యాచ్ ఈ నెల 11వ తేదీన మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now