IND Vs WI : రెండో వ‌న్డేలోనూ భార‌త్ విజ‌యం.. సిరీస్ కైవ‌సం..

July 25, 2022 7:55 AM

IND Vs WI : పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక‌గా జ‌రిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. విండీస్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. ఈ క్ర‌మంలో 3 వన్డేల సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్ నిర్దేశించిన 312 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ ఛేదించింది. దీంతో విండీస్‌పై భార‌త్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌ను కోల్పోయి 311 ప‌రుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్ల‌లో షై హోప్ 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 115 ప‌రుగులు చేయ‌గా, నికోలాస్ పూర‌న్ 77 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స‌ర్ల‌తో 74 ప‌రుగులు చేశాడు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే దీప‌క్ హుడా, అక్ష‌ర్ ప‌టేల్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

IND Vs WI India won by 2 wickets against West Indies in 2nd ODI
IND Vs WI

అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త్ 49.4 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల‌ను కోల్పోయి 312 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ (64 నాటౌట్‌), శ్రేయాస్ అయ్య‌ర్ (63), సంజు శాంస‌న్ (54), శుబ‌మ‌న్ గిల్ (43)లు ఆక‌ట్టుకున్నారు. విండీస్ బౌల‌ర్ల‌లో అల్జ‌రి జోసెఫ్‌, కైలీ మ‌య‌ర్స్‌లు చెరో 2 వికెట్లు తీశారు. జేడెన్ సీల్స్‌, రొమారియో షెఫ‌ర్డ్‌, అకియ‌ల్ హోసెయిన్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది. ఈ క్ర‌మంలోనే సిరీస్‌లో చివ‌రిదైన మూడో వ‌న్డే ఈ నెల 27వ తేదీన ఇదే వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. రాత్రి 7 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now