Udayabhanu : బిగ్ బాస్ 6 లో యాంక‌ర్ ఉద‌య‌భాను..? భారీగా రెమ్యున‌రేష‌న్‌..?

July 24, 2022 7:07 PM

Udayabhanu : బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌కు మ‌రింత వినోదాన్ని పంచేందుకు బిగ్ బాస్ 6 సిద్ధ‌మ‌వుతోంది. ఈ సీజ‌న్ గురించి ఇది వ‌ర‌కే ప్ర‌క‌ట‌న చేశారు. ఈ క్ర‌మంలోనే ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సీజ‌న్‌కు కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక ఇటీవ‌ల ముగిసిన బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో వ‌చ్చిన టాప్ 5 కంటెస్టెంట్ల‌ను బిగ్ బాస్ 6కు నేరుగా తీసుకుంటార‌ని తెలుస్తోంది. అలాగే మిగిలిన కంటెస్టెంట్ల కోసం ప్ర‌స్తుతం ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సీజ‌న్‌ను ప్రారంభించ‌నున్నారు. అయితే ఈ సారి సీజ‌న్‌లో సీనియ‌ర్ యాంక‌ర్ ఉద‌య భాను ను తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు చూస్తున్నార‌ట‌.

యాంక‌ర్ ఉద‌య‌భాను ప్ర‌స్తుతం ఎలాంటి షోస్‌, సినిమాలు చేయ‌డం లేదు. కానీ ఆమెకు పాపులారిటీ బాగానే ఉంది. ఆమె మాట‌లు, యాంక‌రింగ్ ఎంతో మందిని ఆక‌ట్టుకుంటాయి. ఆమె షోలో ఉంటే క‌ళ వ‌స్తుంది. ఎంత‌గానో అల‌రించ‌గ‌ల‌దు. క‌నుక‌నే ఆమెకు ఎంత రెమ్యున‌రేష‌న్ అయినా స‌రే ఇచ్చి బిగ్ బాస్ లోకి ర‌ప్పించాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు భారీ మొత్తం ఆఫ‌ర్ చేశార‌ని కూడా తెలుస్తోంది. అయితే ఆమె అందుకు ఓకే చెప్పిందా.. లేదా.. అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌లేదు.

Udayabhanu reportedly got Bigg Boss 6 offer
Udayabhanu

ఇక ఉద‌యభాను యాంక‌ర్‌గానే కాక సినిమాల్లోనూ న‌టించి అల‌రించింది. ఈమె రానా హీరోగా వ‌చ్చిన లీడ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌రా.. అంటూ ప్ర‌త్యేక పాట‌లోనూ నర్తించి ఆక‌ట్టుకుంది. అయితే ఈమె బిగ్ బాస్‌లో పాల్గొంటే క‌చ్చితంగా రేటింగ్స్ వ‌స్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక‌నే ఈమె కోసం నిర్వాహ‌కులు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఇక ఈ షో ఆగస్టు చివ‌రి వారం లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment