బిగ్ బాస్ సీజ‌న్ 6లో.. ఉద‌య‌భానుకే అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్‌..?

August 19, 2022 2:31 PM

ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఈ సీజ‌న్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. తాజాగా విడుదల చేసిన సీజన్ 6 ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవ‌ల ముగిసిన బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో వ‌చ్చిన టాప్ 5 కంటెస్టెంట్ల‌ను బిగ్ బాస్ 6కు నేరుగా తీసుకుంటార‌ని తెలుస్తోంది. అలాగే మిగిలిన కంటెస్టెంట్ల కోసం ప్ర‌స్తుతం ఎంపిక ప్ర‌క్రియ‌ జ‌రుగుతోంది.

అయితే ఈ సారి సీజ‌న్‌లో ప్రముఖ సీనియ‌ర్ యాంక‌ర్ ఉద‌య భానును తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నారట. యాంక‌ర్ ఉద‌య‌భాను ప్ర‌స్తుతం ఎలాంటి షోస్‌, సినిమాలు చేయ‌డం లేదు. కానీ ఆమెకు పాపులారిటీ బాగానే ఉంది. ఆమె మాట‌లు, యాంక‌రింగ్ ఎంతో మందిని ఆక‌ట్టుకుంటాయి. ఆమె షోలో ఉంటే జోష్ వ‌స్తుంది. అందుకే నిర్వాహకులు ఎంత ఇచ్చి అయినా ఆమెను షోలోకి తీసుకు రావాలని చూస్తున్నారట.

udayabhanu getting highest remuneration for bigg boss telugu 6

ఆమె రోజుకి తీసుకునే సగటు రెమ్యూనరేషన్ చూస్తే అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్‌ ఉదయభానే అని సమాచారం. ఈ మాజీ టాప్ యాంకర్ గత రెండేళ్లుగా బిగ్ బాస్‌లోకి ప్రవేశించడానికి నిరాకరించినప్పటికీ, సీజన్ 6లో భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయభాను కనుక షోలోకి ఎంటర్ అయితే.. ఈజీగా 100 రోజుల కంటే ఎక్కువ ఉంటుందని బెట్టింగ్ లు కూడా కాస్తున్నారట.

ఇక ఉద‌యభాను యాంక‌ర్‌గానే కాక సినిమాల్లోనూ న‌టించి అల‌రించింది. ఈమె రానా హీరోగా వ‌చ్చిన లీడ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌రా.. అంటూ ప్ర‌త్యేక పాట‌లోనూ నర్తించి ఆక‌ట్టుకుంది. ఇటీవల పుష్ప సక్సెస్ ప్రోగ్రాం కర్నూల్ లో యాంకర్ గా చేసి బన్నీ ఫాన్స్ ని అలరించింది. అయితే ఉదయభాను బిగ్ బాస్‌లో పాల్గొంటే క‌చ్చితంగా రేటింగ్స్ వ‌స్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక‌నే ఈమె కోసం నిర్వాహ‌కులు అంతగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఈ షో ఆగస్టు చివ‌రి వారం లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now