Sudigali Sudheer : బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ రూపంలో సుడిగాలి సుధీర్ ఎంట్రీ..? ఇక రేటింగ్స్ బ‌ద్ద‌లు కావ‌డం ఖాయం..!

October 1, 2022 7:59 PM

Sudigali Sudheer : బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పర్లేదు. బుల్లితెర సూపర్ స్టార్ అంటూ సుధీర్‌ ని ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. అయితే అది గతం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బుల్లితెరపై ఆయన సందడి తగ్గి పోయింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను వదిలి వెళ్ళి పోయినా సుధీర్‌ కి స్టార్ మా వారు పెద్ద షాకిచ్చారు. అందులో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని క్యాన్సల్ చేశారట. బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేమని చేతులెత్తేయడంతో సుడిగాలి సుధీర్‌ తిరిగి ఈటీవీలోకి వెళ్లలేక.. ఏం చేయాలో తెలీక ఇబ్బంది పడుతున్నాడట.

ఎలాగో స్టార్ మా వాళ్లు ఈటీవీ నుండి సుడిగాలి సుధీర్‌ ని తీసుకొచ్చారు కనుక బిగ్ బాస్ లో అవకాశం కల్పించారట. బిగ్ బాస్ సీజన్ 6 ఐదవ వారంలో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించలేక పోతున్నారు. అందుకే ఈ సమయంలో సుడిగాలి సుధీర్‌ హౌస్ లోకి వెళితే కచ్చితంగా మంచి రేటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో సుధీర్ కి భారీ పారితోషకం ఆఫర్ చేసి మరీ హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది.

Sudigali Sudheer may enter into bigg boss 6 very soon
Sudigali Sudheer

సోమవారం లేదా మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో సుడిగాలి సుధీర్ అడుగు పెట్టే అవకాశం ఉందంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే బుల్లితెర ద్వారా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ లోకి వెళ్లడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు మాత్రం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగానే ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై 1,2 రోజుల్లోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుధీర్ కనుక హౌస్ లోకి ఎంటర్ అయితే.. ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now