గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Udayabhanu : ఆ సమయంలో చెమటలతో బట్టలు మొత్తం తడిసిపోయేవి..!

Udayabhanu : తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా సుమారు పదిహేను సంవత్సరాల పాటు వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగిన వారిలో యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి…

Udayabhanu : ఆ సమయంలో చెమటలతో బట్టలు మొత్తం తడిసిపోయేవి..!

Udayabhanu : తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా సుమారు పదిహేను సంవత్సరాల పాటు వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగిన వారిలో యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తనకు చిన్నపిల్లలు ఉండడంచేత ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Udayabhanu told about her first movie and acting

అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయభాను తన కెరీర్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. చిన్నప్పటి నుంచి తనకు ఎన్నో బరువు బాధ్యతలు పెరిగాయని అయితే తన తల్లి తనకు డాన్స్ నేర్పించడంతో ఎన్నో స్టేజ్ కార్యక్రమాలలో డాన్స్ చేశానని ఆ సమయంలో చాలా మంది సినిమాలలో ప్రయత్నించ వచ్చు కదా అని తనని ప్రోత్సహించారని ఈ సందర్భంగా ఉదయభాను తెలిపారు.

అలా అందరి ప్రోత్సాహంతోనే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని.. అయితే తను యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టడానికి ముందు సినిమాలలో నటించానని.. అలా ఎర్రసైన్యం సినిమాలో తాను నటించానని ఈ సందర్భంగా ఉదయభాను తెలిపారు. ఎర్రసైన్యం సినిమా సమయానికి నేను ఎంతో పొడవుగా ఉన్నా.. అప్పటికి నాకింకా చిన్న వయసని తెలిపింది. ఆ సమయంలో డైలాగులు చెప్పాలంటే భయంతో చెమటలు పట్టి బట్టలు మొత్తం తడిసిపోయాయని.. ఈ సందర్భంగా ఉదయభాను అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి