T20 World Cup 2021: దుమ్ము లేపిన టీమిండియా.. రెండో వార్మ‌ప్ మ్యాచ్‌లోనూ విజ‌యం..!

October 20, 2021 7:01 PM

T20 World Cup 2021: ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021లో భాగంగా యూఏఈలో జ‌ర‌గుతున్న వార్మ‌ప్ మ్యాచ్‌ల‌లో భార‌త్ స‌త్తా చాటింది. మొద‌ట ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్ లో ఘ‌న విజ‌యం సాధించ‌గా.. బుధ‌వారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఇంకో వార్మ‌ప్ మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆసీస్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

T20 World Cup 2021 india won by 8 wickets against australia in 2nd warm up match

దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ల‌లో స్టీవెన్ స్మిత్‌, మార్క్ స్టాయినిస్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌లు రాణించారు. 48 బంతులు ఆడిన స్మిత్ 7 ఫోర్ల‌తో 57 ప‌రుగులు చేయ‌గా, 25 బంతులు ఆడిన స్టాయినిస్ 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 41 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ‌రో బ్యాట్స్‌మ‌న్ మ్యాక్స్‌వెల్ 28 బంతుల్లో 5 ఫోర్ల‌తో 37 ప‌రుగులు చేశాడు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో రవిచంద్ర‌న్ అశ్విన్ 2 వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, ర‌వీంద్ర జ‌డేజా, రాహుల్ చాహ‌ర్ త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ సునాయాసంగానే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 17.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో రోహిత్ శ‌ర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 60 ప‌రుగులు చేసి రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 39 ప‌రుగులు చేయ‌గా, సూర్య‌కుమార్ యాద‌వ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 38 ప‌రుగులు చేశాడు. మ‌రో బ్యాట్స్‌మ‌న్ హార్దిక్ పాండ్యా 8 బంతుల్లో 1 సిక్స‌ర్‌తో 14 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో అగ‌ర్ 1 వికెట్ తీశాడు.

కాగా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా భార‌త్ త‌న తొలి మ్యాచ్‌ను ఈ నెల 24వ తేదీన పాకిస్థాన్‌తో ఆడ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment