గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Shanmukh : దీప్తితో బ్రేక‌ప్.. ఆమెని క‌లిసి మాట్లాడాల‌ని చెప్పిన ష‌ణ్ముఖ్‌..

Shanmukh : బిగ్ బాస్ సీజ‌న్ 5 ర‌న్న‌ర్ ష‌ణ్ముఖ్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌చ్చాడు. ముఖ్యంగా సిరితో అతను ప్ర‌వ‌ర్తించిన తీరు హాట్ టాపిక్‌గా మారేలా చేసింది. సిరితో రిలేషన్‌,…

Shanmukh : దీప్తితో బ్రేక‌ప్.. ఆమెని క‌లిసి మాట్లాడాల‌ని చెప్పిన ష‌ణ్ముఖ్‌..

Shanmukh : బిగ్ బాస్ సీజ‌న్ 5 ర‌న్న‌ర్ ష‌ణ్ముఖ్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌చ్చాడు. ముఖ్యంగా సిరితో అతను ప్ర‌వ‌ర్తించిన తీరు హాట్ టాపిక్‌గా మారేలా చేసింది. సిరితో రిలేషన్‌, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. హౌస్‌లోకి వచ్చే ముందే సిరికి శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరగడం, షణ్నూ.. దీప్తి సునయనతో రిలేషన్‌ షిప్‌లో ఉండటంతో వారి ప్ర‌వ‌ర్త‌న జ‌నాల‌కు అస్స‌లు మింగుడు ప‌డ‌లేదు. దారుణంగా ఈ ఇద్ద‌రినీ ట్రోల్ చేశారు.

Shanmukh and deepthi sunaina breakup he said that he will talk to her

బిగ్‏బాస్ టైటిల్ రేసులో ఉన్న షణ్ముఖ్ ఆ తర్వాత.. సిరితో స్నేహం.. శ్రుతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. అయితే హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు జంట పాములుగా క‌నిపించిన ఈ జంట బ‌య‌ట‌కు వ‌చ్చాక ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇక షన్నూ అయితే రూమర్స్ రావడం కొత్తేమీ కాదంటూ ఇప్పుడు తెల్చీ చెప్పేశాడు. తాజాగా తన ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన షణ్ముఖ్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

ఓ నెటిజ‌న్ దీప్తి సునయన గురించి అడగడంతో బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చాడు షన్నూ. ప్రస్తుతం తనను బ్లాక్ చేసిందని.. కోపం వచ్చినా.. అలిగినా ఇలాగే బ్లాక్ చేస్తుందని.. త్వరలోనే హైదరాబాద్ వెళ్లి తనను కలుస్తానని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. దీప్తి నా వల్ల చాలా నెగెటివిటీని ఫేస్ చేసింది. అయినా నా కోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి