Shanmukh : ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. అరె ఏంట్రా ఇది.. అంటూ పలకరిస్తున్న ఫ్యాన్స్..

September 6, 2022 9:47 PM

Shanmukh : ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది యూత్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. యాక్టింగ్, డ్యాన్స్ చేస్తూ అతడు అప్‌లోడ్ చేసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది. దీంతో అతడి పేరు సెన్సేషన్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన షణ్ముఖ్ గత ఏడాది బిగ్ బాస్ సీజన్‌ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు.

కానీ, హౌస్‌లో సిరి హన్మంత్‌తో కలిసి చేసిన రచ్చ వల్ల అతడికి చెడ్డ పేరు వచ్చింది. దీంతో షన్ను ప్రేమించిన దీప్తి సునైనా కూడా అతడికి బ్రేకప్ చెప్పేసింది. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు తన కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ ను చేశాడు. తరచూ షూటింగ్‌లు చేయడం.. జిమ్‌లో తెగ వ్యాయామాలు చేయడం వంటివి చేస్తున్నాడు.

Shanmukh hospitalized fans worry about him
Shanmukh

ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి షణ్ముఖ్ ఆస్పత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన ఫొటోను స్వయంగా అతడే షేర్ చేశాడు. దీంతో అతడికి ఏమైందో అని అభిమానులు కంగారు పడిపోయారు. అయితే తాజాగా అతడు ఓ సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టుకున్నాడు. ఇందులో కొద్దిగా కోలుకున్నాను అని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి కొందరు అరే ఏంట్రా నీ బర్త్ డే ముందు ఇలా జరిగింది.. దిష్టి తగిలినట్టుంది అంటూ ఓ ఫ్రెండ్ లా పలకరిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now