Deepthi Sunaina : ష‌ణ్ముఖ్‌ను టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టిన దీప్తి సునైనా..? అంత‌గా హ‌ర్ట్ అయిందా..?

July 5, 2022 11:09 AM

Deepthi Sunaina : బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో పాపుల‌ర్ అయిన దీప్తి సునైనా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె యూట్యూబ్‌లో వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. త‌రువాత బిగ్ బాస్ షోలో పాల్గొని మ‌రింత క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈమె ఎప్ప‌టిలాగే వీడియోలు చేస్తూ త‌న ప‌నేంటో తాను చేసుకుంటోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ ఈమె ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అందులో త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈమె పెట్టే పోస్టులు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంటాయి.

దీప్తి సునైనా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసే ఫొటోలు ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. ఈమెకు ఇన్ స్టాలో 38 ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు. దీంతో ఈమె పాపులారిటీ రోజు రోజుకీ మ‌రింత పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇప్పుడు ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌లే విడుద‌లైన విరాట‌ప‌ర్వంలోని ఒక సీన్ తాలూకు స‌న్నివేశాన్ని ఆమె పెట్టి అక్క‌డ విరాట ప‌ర్వం అని హ్యాష్ టాగ్ ఉంచింది. ఆ సీన్‌లో ర‌వ‌న్న (రానా) త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన వెన్నెల (సాయిప‌ల్ల‌వి)కి ప్రేమ అనేది ఒక అబ‌ద్ధ‌మ‌ని చెబుతుంటాడు. స‌రిగ్గా అదే సీన్‌ను దీప్తి సునైనా షేర్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Deepthi Sunaina shared a post about Shanmukh
Deepthi Sunaina

గ‌తంలో షణ్ముఖ్‌, దీప్తి ఇద్ద‌రూ ల‌వ్ బ‌ర్డ్స్ అన్న విష‌యం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షోలో ష‌ణ్ముఖ్‌, సిరి ఇద్ద‌రూ చాలా క్లోజ్‌గా ఉన్నారు. దీంతో దీప్తి ష‌ణ్ముఖ్‌కు బ్రేక‌ప్ చెప్పింది. బిగ్ బాస్ షోలో ష‌ణ్ముఖ్‌, సిరి ప్ర‌వ‌ర్తించిన తీరు కార‌ణంగానే విడిపోతున్నాం అని దీప్తి సునైనా చెప్పేసింది. అయితే ఇప్పుడు ఆమె ప్రేమ అబ‌ద్దం అనే సీన్‌ను షేర్ చేయ‌డంపై చ‌ర్చ న‌డుస్తోంది. ఆమె ల‌వ్ బ్రేక‌ప్ వ‌ల్ల తీవ్రంగా మ‌న‌స్థాపం చెందింద‌ని.. క‌నుక‌నే ఇలాంటి పోస్ట్ పెట్టింద‌ని అంటున్నారు. ష‌ణ్ముఖ్‌ను ఎంత‌గానో న‌మ్మిన దీప్తి బిగ్ బాస్‌లో అత‌ని వ్య‌వ‌హారం న‌చ్చ‌క‌నే అత‌నికి బ్రేక‌ప్ చెప్పింది. అయితే ఎంతో న‌మ్మ‌కంగా ఉండే అత‌ను ఇలా చేయ‌డాన్ని త‌ల‌చుకుని ఆమె ఇప్ప‌టికీ మ‌న‌స్థాపం చెందుతుంద‌ని.. క‌నుక‌నే ఇలా ప్రేమ అనేది ఒక అబ‌ద్దం అనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేందుకే ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టింద‌ని.. దీని వ‌ల్ల ష‌ణ్ముఖ్‌కు మెసేజ్ ఇన్‌డైరెక్ట్‌గా వెళ్తుంద‌ని అంటున్నారు. ఏది ఏమైనా ల‌వ్ బ్రేక‌ప్ వ‌ల్ల దీప్తి సునైనా బాగా హ‌ర్ట్ అయింద‌నే విషయం మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment