Siri : ష‌ణ్ముఖ్ జీవితాన్ని అలా చేసి నువ్వు బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తావా..? సిరిపై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు..

February 6, 2022 1:33 PM

Siri : ఇటీవ‌లే ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 షోలో హౌస్‌లో సిరి, ష‌ణ్ముఖ్‌లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్ద‌రూ పాముల్లా మెలిగారు. హ‌గ్గులతో హోరెత్తించారు. ఎవరెన్ని తిట్టినా.. ఆఖ‌రికి హోస్ట్ నాగార్జున అక్షింత‌లు వేసినా వారు విన‌లేదు. అదేదో ఇష్ట‌మైన కార్యం అయిన‌ట్లు ప్ర‌వ‌ర్తించారు. అయితే షో ముగిశాక ఎవ‌రి ఇళ్ల‌కు వారు వెళ్లిపోయారు. కానీ అది ష‌ణ్ముఖ్ జీవితంలో చిచ్చు పెట్టింది. అత‌ను ఎంత‌గానో ప్రేమించిన దీప్తి అత‌నికి బ్రేక‌ప్ చెప్పింది. దీంతో ఈ జంట విచారంలో మునిగిపోయింది.

bigg boss telugu fame Siri met anchor ravi with her boy friend srihan
Siri

అయితే ష‌ణ్ముఖ్‌తో ఎంతో క్లోజ్‌గా మెలిగిన సిరి మాత్రం త‌న బాయ్ ఫ్రెండ్ శ్రీ‌హాన్‌తో క‌లిసి చెట్టా ప‌ట్టాలు వేసుకుని తిరుగుతోంది. అస‌లు షోలో త‌న‌కు, ష‌ణ్ముఖ్‌కు మ‌ధ్య ఏమీ జ‌ర‌గ‌న‌ట్లే, ఏమీ తెలియ‌న‌ట్లే ప్ర‌వ‌ర్తిస్తోంది. తాజాగా ఆమె శ్రీ‌హాన్‌తో క‌లిసి యాంక‌ర్ ర‌వి ఇంటికి వెళ్లింది.

యాంక‌ర్ ర‌వి ఇంటికి వెళ్లిన సిరి, ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీ‌హాన్‌లు అక్క‌డ స‌ర‌దాగా గ‌డిపారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ దిగిన ఫొటోల‌ను వారు షేర్ చేశారు. అయితే ష‌ణ్ముఖ్ జీవితంతో సిరి ఆడుకుంద‌ని.. ఇప్పుడు ష‌ణ్ముఖ్ జీవితం తెగిన గాలిప‌టంలా మారింద‌ని.. కానీ సిరి మాత్రం త‌న బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుంద‌ని.. నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

అస‌లు సిరి ష‌ణ్ముఖ్‌ను ప్ర‌స్తుతం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక త్వ‌ర‌లోనే బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆ షో వేదిక‌గా.. దీప్తి, ష‌ణ్ముఖ్‌ల‌ను మ‌ళ్లీ బిగ్ బాస్ క‌లుపుతార‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now