Shalini Pandey : అర్జున్ రెడ్డి బ్యూటీ అందాల ఆరబోత ఈ రేంజ్‌లో ఉంటే.. త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

April 27, 2022 4:25 PM

Shalini Pandey : విజయ్ దేవ‌ర‌కొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి సినిమాతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మ‌డు ఆ సినిమాతో ఏ స్థాయిలో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రీతి పాత్రతో యువకుల మనసుల‌ను దోచుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ లో ట్రెడిషినల్ లుక్ తో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత రొమాన్స్ తో బోల్డ్ గా కనిపించి షాక్ ఇచ్చింది. అయితే ఈ అమ్మ‌డు తెలుగులో కనిపించడం తక్కువ అయిపోయింది.

Shalini Pandey latest denim colour dress photos viral
Shalini Pandey

మహానటి సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈ భామ త‌మిళంలో 100 పర్సెంట్ లవ్ రీమేక్‌లో కూడా నటించింది. ఇక జీవా గొరిల్లా, కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. కెరీర్ మొద‌ట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల స్లిమ్‌గా మారి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. ఆ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా షాలినీ పాండే డెనిమ్ షార్ట్స్, బ్లూ క‌ల‌ర్ నెక్ టాప్ ధ‌రించి ఎద అందాల‌ను య‌థేచ్ఛ‌గా ఆర‌బోస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. షాలినీ స్ట‌న్నింగ్ లుక్స్ చూసి వావ్.. అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఈ బ్యూటీ ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్‌తో క‌లిసి జ‌యేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు మహారాజా సినిమా కూడా చేస్తోంది. అయితే అర్జున్ రెడ్డి అనంతరం షాలినీకి మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు పడలేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పటికీ పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రాలేదు. మహానటి సావిత్రి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన అనంతరం ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. మధ్యలో 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాలు ఫ‌రవాలేదనిపించే విధంగా రిజల్ట్ ను అందుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now