Rashmika Mandanna : చిన్న‌వాడితో ర‌ష్మిక డేటింగ్ చేస్తుందా..? ఆమె స‌మాధానం ఏంటి ?

November 14, 2021 8:50 AM

Rashmika Mandanna : క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మందన్న ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్‌గా మారింది. బడా హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ర‌ష్మిక‌.. తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. పెద్ద ఎత్తున ఈ అమ్మడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ లు గా నిలుస్తున్నాయి.

Rashmika Mandanna replied to a question where will she love boys who are younger than her

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది. వ్యక్తిగత విషయాలతోపాటు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంటుంది. ఇటీవల ప్రముఖ డేటింగ్‌ యాప్‌ ఒకటి నిర్వహించిన ‘స్వైప్‌ రైడ్‌’ అనే టాక్‌ షోలో రష్మిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మీకంటే చిన్నవాడితో డేటింగ్‌ చేస్తారా.?’ అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు రష్మిక బదులిస్తూ.. ‘నా దృష్టిలో వయసు అనేది అసలు సమస్యే కాదు. ప్రేమకు వయస్సుతో సంబంధం ఏంటి.? వారు మమ్మల్ని మార్చేందుకు ప్రయత్నించకూడదు అంతే.. అప్పుడు వయసు పెద్ద విషయం కాదు’ అని క్లారిటీగా చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో చొక్కా లేకుండా పోజులిచ్చే అబ్బాయిల గురించి మాట్లాడుతూ “కుర్రాళ్లు ఫిట్‌గా కన్పించడాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. మీరు ఎంత అంకితభావంతో ఉన్నారో అది చూపిస్తుంది. కానీ దీన్ని మీ ప్రొఫైల్ ఫోటోగా ఉంచాలని ఎందుకు కోరుకుంటున్నారు ? శరీరం కంటే ముందు మీరేంటో వాళ్లకు తెలియాలి కదా.. అని బదులిచ్చింది ర‌ష్మిక‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now