గురువారం, జూన్ 11, 2026
వినోదం

విజయ్-రష్మిక ఉదారత.. 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటన!

ఇటీవ‌లే రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకున్న టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న సామాజిక సేవా ప్రకటనతో ముందుకొచ్చారు. మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్‌కు ముందు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు ప్రకటించారు.

విజయ్-రష్మిక ఉదారత.. 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటన!
తుమ్మన్‌పేటలో గృహప్రవేశం సందర్భంగా సామాజిక సేవ ప్రకటించిన విజయ్-రష్మిక. Photo Credit: India Today.
Vijay Deverakonda and Rashmika Mandanna announcing scholarships at their ancestral village.
తుమ్మన్‌పేటలో గృహప్రవేశం సందర్భంగా సామాజిక సేవ ప్రకటించిన విజయ్-రష్మిక. Photo Credit: India Today.

ఇటీవ‌లే రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకున్న టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న సామాజిక సేవా ప్రకటనతో ముందుకొచ్చారు. మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్‌కు ముందు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజ‌య్ త‌న దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ జంట విజయ్ పూర్వీకుల గ్రామమైన తుమ్మన్‌పేటలో కొత్త ఇంటిలో గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్య‌క్ర‌మానికి విజయ్ తల్లిదండ్రులు, సోదరుడు కూడా హాజరయ్యారు. స్కాలర్‌షిప్ ప్రకటన అనంతరం గ్రామం అంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది.

అట్ట‌హాసంగా వివాహ వేడుక‌లు..

ఈ జంట తొలుత విజయ్ సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూ సంప్రదాయ తెలుగు పద్ధతిలో వివాహం చేసుకున్నారు. సాయంత్రం రష్మిక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ కొడువ శైలిలో మరో వివాహ వేడుక నిర్వహించారు. వివాహ వార్తలపై తొలుత మౌనం పాటించిన ఈ జంట ఫిబ్రవరి 23 నుంచి ప్రీ-వెడ్డింగ్ వేడుకల ప్రత్యేక క్షణాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో అతిథుల కోసం ప్రత్యేక జపనీస్ డిన్నర్, పూల్ వాలీబాల్, VIROSH Premiere League పేరుతో స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించారు. మెమెంటోస్ హిల్ రిసార్ట్‌లో సంగీత్ వేడుక జరిగింది. ఫిబ్రవరి 25న హల్దీ, మెహందీ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి.

ఆహ్వానితుల‌కు మాత్ర‌మే రిసెప్ష‌న్‌..

వివాహానికి దర్శకుడు, నటుడు త‌రుణ్ భాస్క‌ర్‌, దర్శకుడు, నటుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌, నటీమ‌ణులు ఈషా రెబ్బా, అశిక రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నటి క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తదితరులు హాజరయ్యారు. కాగా మార్చి 4న జరగనున్న రిసెప్షన్ ను తొలుత తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమల ప్రముఖుల‌తోపాటు రాజకీయ, పరిపాలనా రంగాల నేతలకు మాత్రమే ప్రత్యేకంగా నిర్వహించాలని యోచించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ వేడుక పూర్తిగా ఆహ్వానితులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు జంట బృందం వెల్లడించింది. ఇక విజయ్-రష్మిక సంయుక్త ప్రకటనలో.. మీ భద్రత, ఆనందం మాకు అత్యంత ముఖ్యమైనవి. మీ ఆశీర్వాదాలు, మద్దతుకు మేము కృతజ్ఞులం. ఈ వేడుక అందరికీ సురక్షితంగా, ఆనందంగా సాగేందుకు సహకరించండి.. అని పేర్కొన్నారు. ఇదే వేడుకకు ప్రధాని మోదీనికి కూడా ఆహ్వానించారు. అయితే వివాహ వేడుకలతో పాటు సామాజిక బాధ్యతను ముందుకు తెచ్చిన విజయ్ నిర్ణయం గ్రామస్థుల ప్రశంసలను అందుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి