Rashi Khanna : త‌న అందాల‌తో గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న రాశీ ఖ‌న్నా..!

April 30, 2022 10:29 AM

Rashi Khanna : మోడ‌లింగ్ నుండి సినిమాల‌లోకి వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ‌ల‌లో రాశీ ఖ‌న్నా ఒక‌రు. మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాలో నటించి.. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలను చేస్తూ టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయింది. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న రాశీ.. మధ్యలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేసింది.

Rashi Khanna latest red color dress photos viral
Rashi Khanna

ఇటీవ‌ల కాలంలో రాశీ ఖ‌న్నా వెంకీ మామ, ప్రతిరోజూ పండగేతో వరుస హిట్లను అందుకుంది. అలా హవా చూపిస్తోన్నప్పుడే వరల్డ్ ఫేమస్ లవర్ తో ఫ్లాప్‌ను చవి చూసింది. ఇక ఇటీవలే ఈ అమ్మడు రుద్ర అనే సిరీస్‌లో నటించింది. ఇందులో సైకో పాత్రను చేసి క్రేజ్ పెంచుకుంది. ప్ర‌స్తుతం ఈమె తెలుగులో నాగ చైతన్యతో థాంక్‌యూ, గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో తుగ్లక్ దర్బార్, అరన్మనై 3, మేథావి, సైతాన్ కా బచ్చా.. మలయాళంలో బ్రహ్మమ్ అనే మూవీలు చేసింది. అలాగే హిందీలోనూ నటిస్తోంది.

ఒక‌వైపు సినిమాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త లుక్స్‌లో క‌నిపిస్తూ కుర్ర‌కారు హృద‌యాలు దోచుకుంటోంది. తాజాగా క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తూ నిద్ర లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఒక‌ప్పుడు చాలా లావుగా ఉండే రాశీ ఖ‌న్నా ఇప్పుడు స్లిమ్‌గా మారి త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంటోంది. ఈ అమ్మ‌డి ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now