Rashi Khanna : బ్లాక్ డ్రెస్‌లో పాల అందాల‌తో మ‌తులు పోగొడుతున్న రాశి ఖ‌న్నా..!

June 11, 2022 11:45 AM

Rashi Khanna : మ‌ద్రాస్ కేఫ్ అనే సినిమాతో సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన బ్యూటీ.. రాశి ఖ‌న్నా. త‌రువాత తెలుగు సినిమాల్లోనే ఈ అమ్మ‌డు ఎక్కువ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మ‌నం సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో న‌టించిన ఈమె త‌రువాత ఊహ‌లు గుస‌గుస‌లాడే మూవీతో పూర్తి స్థాయి నిడివి ఉన్న తెలుగు సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. అయితే ఈమెకు గోపీచంద్ స‌ర‌స‌న న‌టించిన జిల్ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. న‌ట‌న‌లోనే కాకుండా యాక్టింగ్‌లోనూ రాశి ఖ‌న్నా మంచి గుర్తింపు పొందింది. దీంతో ఈమె ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఎన్నో సంవ‌త్స‌రాలు అవుతున్నా.. ఇప్ప‌టికీ అవ‌కాశాలు త‌గ్గ‌డం లేదు. ఈ మ‌ధ్యే థాంక్ యూ అనే మూవీలో చైతూ స‌ర‌స‌న న‌టించింది.

రాశిఖ‌న్నా సోష‌ల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండ‌దు. ఇత‌ర హీరోయిన్ల‌తో పోలిస్తే ఈమె సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టులు త‌క్కువే. అయితే ఎప్పుడో ఒక‌సారి అందులో ఫొటోల‌ను షేర్ చేసినా ఈమె గ్లామ‌ర్‌ను మాత్రం క‌చ్చితంగా ఒల‌క‌బోస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఈమె న‌లుపు రంగు డ్రెస్ ధ‌రించి అద‌ర‌గొట్టింది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ రెచ్చి పోయింది. ఈమె గ్లామ‌ర్ షోకు యువ‌త మైమ‌రిచిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈమె లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Rashi Khanna latest black color dress photos viral
Rashi Khanna

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈమె గోపీచంద్‌తో క‌లిసి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే మూవీలో లాయ‌ర్ ఝాన్సీ పాత్ర‌లో న‌టించింది. ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా.. దీనికి మారుతి ద‌ర్శ‌కుడు. అలాగే చైతూతో క‌లిసి న‌టించిన థాంక్ యూ అనే మూవీ కూడా త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. దీంతోపాటు తిరుచిత్రంబ‌లం, స‌ర్దార్‌, షైతాన్ కా బ‌చ్చా అనే త‌మిళ మూవీల్లో ఈమె న‌టిస్తోంది. ఇవే కాకుండా యోధ అనే హిందీ సినిమాలోనూ ఈమె న‌టిస్తోంది. ఇవి ఈ ఏడాదిలో రిలీజ్ కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now