Rashi Khanna : కెరీర్ మొద‌ట్లో అవ‌మానించారు.. రాశి ఖ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

March 23, 2022 7:48 PM

Rashi Khanna : ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలువురు హీరోల సరసన నటించి తెలుగు తెరపై అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది. జిల్, జోరు, బెంగాల్ టైగర్, హైపర్, తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతి రోజు పండగే వంటి సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందింది.

Rashi Khanna said she was insulted at her careeer beginning
Rashi Khanna

ఇలా తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన రాశీ ఖన్నా రుద్ర వెబ్ సిరీస్‏తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. ఈ విధంగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉండే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే తాను కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న చేదు సంఘటనలు గురించి వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కెరియర్లో ఎదుర్కొన్న విమర్శలు ఏంటి అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ కెరీర్ మొదట్లో తన శరీరాకృతి గురించి ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించింది.

దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో తనకు ఎంతో మంచి అవకాశాలు వచ్చాయని, ఇలా అద్భుతమైన అవకాశాలు రావడంతో చాలా సంతోషించానని తెలిపింది. ఇలా ఒకవైపు అవకాశాలు వస్తున్నప్పటికీ మరోవైపు చాలామంది తన శరీరాకృతి గురించి దారుణమైన కామెంట్లు చేసేవారని ఈమె వెల్లడించింది. కెరియర్ మొదట్లో చాలా మంది తనని గ్యాస్ ట్యాంకర్ అంటూ తన బాడీ షేమింగ్ గురించి మాట్లాడేవారని ఈ సందర్భంగా రాశీ ఖన్నా తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎంతో నాజుగ్గా తయారైంది. ప్రస్తుతం ఈమె తెలుగులో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో నాగచైతన్య సరసన థాంక్యూ అనే చిత్రంలో నటించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now