Rashi Khanna : త‌న‌పై వ‌చ్చిన త‌ప్పుడు వార్త‌ల‌కు హ‌ర్ట్ అయిన రాశీ ఖ‌న్నా.. క్లారిటీ ఇచ్చిందిగా..!

April 6, 2022 12:27 PM

Rashi Khanna : త‌న అందం, అభిన‌యంతో మంత్ర ముగ్ధుల‌ని చేసే అందాల ముద్దుగుమ్మ‌ల‌లో రాశీ ఖ‌న్నా ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తొలి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ వ‌రుస ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. జిల్, జోరు, బెంగాల్ టైగర్, హైపర్.. తొలిప్రేమ.. వరల్డ్ ఫేమస్ లవర్.. ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మొదటి నుంచి ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించే రాశీ ఖన్నా.. ఇప్పుడు ట్రెండ్ మార్చింది. గ్లామర్ షోలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ దూసుకుపోతోంది. సోష‌ల్ మీడియాలోనూ అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తోంది.

Rashi Khanna said that she was hurt on those comments
Rashi Khanna

దాదాపు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్‏తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. అయితే కెరీర్ ఆరంభంలో తాను బాడీ షేమింగ్ ఎదుర్కోన్నానని.. బొద్దుగా ఉండడం వలన దక్షిణాది చిత్రపరిశ్రమ వాళ్లు తనపై కామెంట్స్ చేసేవారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మొదట టాలీవుడ్ లో సక్సెస్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేదు. దాంతో కోలీవుడ్ లో సినిమాలు మొదలు పెట్టింది. అక్కడ కూడా నిరాశే ఎదురు అయ్యింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం తో ఇంతకాలం సినిమాలు చేసిన సౌత్ పైనే షాకింగ్ కామెంట్స్ చేసింది.

సౌత్ సినిమాలు చేస్తున్నంత కాలం రొటీన్ ఫార్ములా కు అలవాటు పడ్డా.. అని చెప్పింది. తనకు రొటీన్ పాత్రలు చేయడం ఇష్టం ఉండదు అని.. హీరోల పక్కన కాసేపు నటించడం ఆ తరవాత పక్కకి వెళ్లిపోవడం సౌత్ లో రోటీన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని సౌత్ ప‌రిశ్ర‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నావా అంటూ తెగ ట్రోల్ చేశారు. ఈ క్ర‌మంలో స్పందించిన రాశీ ఖ‌న్నా.. బాడీ షేమింగ్ గురించి నేను చేసిన ప్ర‌క‌ట‌న‌ను త‌ప్పుగా అర్ధం చేసుకున్నారు.

నేను ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌లేదు.. అని స్ప‌ష్టం చేసింది. కాగా, దక్షిణాదిలో చాలా మంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవాళ్లు. కొంతకాలం గడిచే సరికి సన్నగా మారాలని నిర్ణయించుకున్నాను.. ఫిట్ అయ్యాను. నేను చేస్తున్న వృత్తికి నాజుగ్గా ఉండడం ఎంతో అవసరమని అర్థమైంది. అందుకే సన్న బడ్డాను… అంతేకానీ వాళ్ల నోర్లు మూయించాలని కాదు.. సోషల్ మీడియాలోనూ ఇలాంటి విమర్శలు ఎదురైనప్పటికీ నేను ఏమాత్రం బాధ‌పడలేదు.. అంటూ చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now