చంద్ర‌బాబుకు ర‌జ‌నీకాంత్ ఫోన్ కాల్ చేయ‌లేద‌ట‌..? అదంతా వ‌ట్టి ప్ర‌చార‌మేన‌ట..?

November 21, 2021 5:47 PM

ఏపీ అసెంబ్లీలో త‌న‌పై, త‌న భార్య భువ‌నేశ్వ‌రిపై అస‌భ్య ప‌ద‌జాలం ఉప‌యోగించార‌ని, దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని.. చెబుతూ చంద్ర‌బాబు నాయుడు ప్రెస్ మీట్‌లో గుక్క పెట్టి ఏడ్చారు. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబును ఓదారుస్తూ ర‌జ‌నీకాంత్ ఫోన్ కాల్ చేశార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇదంతా వ‌ట్టి ప్ర‌చార‌మేన‌ని, చంద్ర‌బాబుకు సింప‌తీ వ‌చ్చేందుకు టీడీపీలోని ఓ వ‌ర్గ‌మే ఇలా ప్రచారం చేస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

rajnikanth not made phone call to chandra babu says some media houses

ఇటీవ‌ల ప‌ట్టాభి వ్యాఖ్య‌ల అనంత‌రం ఏపీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై ఫిర్యాదు చేసేందుకు బాబు ఢిల్లీ వెళ్ల‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో అపాయింట్‌మెంట్ ల‌భించ‌లేదు. దీంతో బాబు రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేసి వెన‌క్కి వ‌చ్చేశారు. త‌రువాత అమిత్ షా ఫోన్ చేశార‌ని క‌ల‌రింగ్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఇక ఇప్పుడు కూడా సింప‌తీ కొట్టేసేందుకే ర‌జ‌నీకాంత్ పేరును టీడీపీ వాడుకుంటుంద‌ని.. మీడియాలో కొన్ని వ‌ర్గాలు అంటున్నాయి. ర‌జనీకాంత్ నిజంగానే ఫోన్ కాల్ చేసి ఉంటే ఆ విష‌యాన్ని ఆయ‌న త‌న సోష‌ల్ ఖాతాల ద్వారా వెల్ల‌డించేవార‌ని.. అధికారికంగా క‌న్‌ఫాం చేసేవార‌ని.. కానీ ఆయ‌న అలా చేయ‌లేదు.. క‌నుక ఆయ‌న చంద్ర‌బాబుకు ఫోన్ కాల్ చేశార‌న్న మాట కూడా అవాస్త‌వ‌మేన‌ని అంటున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కుప్పంలో ఘోర ఓట‌మి పాలైనందుకు.. తాజాగా ఏపీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సింప‌తీ కొట్టేసేందుకే టీడీపీలోని కొంద‌రు ఇలా ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని.. చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment