మంగళవారం, జూన్ 23, 2026
వార్తలు

Puneeth Rajkumar : పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం.. ఆ సినిమాల ప‌రిస్థితి ఏంటి ?

Puneeth Rajkumar : గ‌త ఏడాది క‌న్న‌డ న‌టుడు చిరంజీవి గుండెపోటుతో క‌న్నుమూయ‌గా, ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ షాక్‌కి గురైంది. పునీత్ రాజ్‌కుమార్ మంచి కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ…

Puneeth Rajkumar : పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం.. ఆ సినిమాల ప‌రిస్థితి ఏంటి ?

Puneeth Rajkumar : గ‌త ఏడాది క‌న్న‌డ న‌టుడు చిరంజీవి గుండెపోటుతో క‌న్నుమూయ‌గా, ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ షాక్‌కి గురైంది. పునీత్ రాజ్‌కుమార్ మంచి కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండేవారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలే కాకుండా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు.

Puneeth Rajkumar death what about his movies

ఆయన 29 సినిమాల జర్నీలో కొన్ని తెలుగు రీమేక్‌లను కూడా చేశారు. చివ‌రిగా యువ‌ర‌త్న చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించారు. ఇక పునీత్ రాజ్‌కుమార్ కెరీర్‌లో హీరోగా 30వ చిత్రం ఖరారయ్యింది. దాని షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. చేతన్ కుమార్ దర్శకత్వంలో ప్రియా ఆనంద్, పునీత్ రాజ్‌కుమార్ జంటగా నటిస్తున్న చిత్రమే ‘జేమ్స్’. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే స్టేజ్‌కు చేరుకుంది. ఇంత‌లోనే ఊహించ‌ని న‌ష్టం జ‌రిగింది.

జేమ్స్ తర్వాత ఒక పాన్ ఇండియా చిత్రానికి సైన్ చేశారు పునీత్ రాజ్‌కుమార్. ‘ద్విత్వ’ అనే టైటిల్‌తో ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. యంగ్ డైరెక్టర్ పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందాల్సి ఉంది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్టాల్సి ఉండ‌గా,ఇప్పుడు ప్రారంభం కాకుండానే ద్విత్వ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పునీత్.. చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రంలో కూడా క‌నిపించాల‌ని ఆశ‌ప‌డ్డాడ‌ట‌. ఇంతలోనే ఆయన కన్ను మూయడం అభిమానులను తీవ్ర విషాదంలో నింపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి